సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సినిమా ద్వారా
టాలీవుడ్ కి పరిచయమైన
హీరోయిన్ అంజలి. అప్పటికే తమిళనాట స్టార్
హీరోయిన్ గా ఉన్న
అంజలి తెలుగులోకి తీసుకురావాలని ఆ చిత్ర బృందం ప్రయత్నించగా తెలుగు అమ్మాయి అయినా
అంజలి ఆ
సినిమా చేయడానికి ఒప్పుకుంది. తొలి సినిమాతోనే ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర చేసి ఆ తర్వాత మరిన్ని అవకాశాలు దక్కించుకుంది. తొలి సినిమాతో వచ్చిన గుర్తింపు తో ఆమె హిట్ చిత్రాలలో నటించింది కానీ వాటి ద్వారా మరిన్ని పెద్ద అవకాశాలను మాత్రం సంపాదించుకోలేక పోయింది.
వచ్చిన అవకాశాలు పెద్దగా ఆమెకు పేరు తెచ్చిపెట్టలేకపోవడంతో ఆమె తిరిగి
తమిళ్ లోనే వరుస సినిమాలు చేయడం ప్రారంభించింది. ఆ మధ్య కొన్ని వివాదాల్లో ఇరుక్కున్న
అంజలి వాటన్నిటి నుంచి తేరుకుని మళ్ళీ ఫ్రెష్ గా సినిమాలను చేస్తూ దూసుకుపోతుంది. ఇటీవలే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో లీడ్ రోడ్ చేసిన నటి
అంజలి దీని ద్వారా తనకు మరిన్ని అవకాశాలు వస్తాయి అని ఎదురు చూస్తుంది.
తూర్పుగోదావరి జిల్లా రాజోలు లో పుట్టిన ఈమె కు 34 సంవత్సరాలు కాగా ఈమె అసలు పేరు బాలాత్రిపురసుందరి. అందరూ సినిమాల్లోకి వచ్చాక అంజలిగా పిలిచేవారు. రాజోలు లో స్టడీస్ పూర్తి చేసిన తర్వాత 2006లో ఫోటో మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత తమిళనాడులో అవకాశం రావడంతో అక్కడికి వెళ్లి వరస హిట్ సినిమాలు చేసి స్టార్
హీరోయిన్ గా ఎదిగింది. ఈమె తన సినిమాల ద్వారా పదికోట్ల కు పైగా సంపాదించగా ఆమె ఒక కోటి రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఈమెకు రెండు ఖరీదైన కార్లు ఉన్నాయట. మరి గతంలో కంటే ఇప్పుడు తన శరీర సౌష్టవాన్ని మార్చుకొని నాజూగ్గా తయారైన అంజలికి మరిన్ని అవకాశాలు హిట్ సినిమాలు వస్తాయో చూడాలి.