టాలీవుడ్ లో మాత్రమే కాదు సౌత్ మొత్తం నయనతార తర్వాత అంత క్రేజ్ దక్కించుకుంటున్న హీరోయిన్  సాయి పల్లవి. మలయాళం లో స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే సాయి పల్లవి ఫిదా సినిమా ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. దీని బట్టి ఆమెకు తెలుగులో ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.  టాలీవుడ్ లోకి ప్రవేశించకముందే తెలుగులో ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

ఆమె నటించిన కొన్ని మలయాళ చిత్రాలు సూపర్ హిట్ కావడంతో ఆమె అందులో బాగా నటించడంతో భాషా భేదం లేకుండా ఆ సినిమాని వీక్షించి సాయిపల్లవి నటనకు ఫిదా అయిపోయారు. సోషల్ మీడియాలో ఆమె తెలుగులో సినిమా చేయాలని డిమాండ్ నెలకొనడంతో శేఖర్ కమ్ముల ఆమెకున్న క్రేజ్ ను గమనించి తెలుగులో ఫిదా సినిమా ద్వారా పరిచయం చేశాడు. ప్రస్తుతం ఆమె చేస్తున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటి విరాటపర్వం మరొకటి నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగ రాయ్. 

ఇక ఆమె టాలీవుడ్ లోకి ప్రవేశించిన సమయంలో కోలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ అక్కడ కూడా మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఆ విధంగా ఆమె ధనుష్ తో చేసిన మారి మూవీ లో రౌడీ బేబీ సాంగ్ అప్పట్లో సంచలనం రేకెత్తించగా ఆ పాట రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ వెళుతుంది. ఇప్పటికే ఈ సాంగ్ ని 1.1 బిలియన్ మంది వీక్షించాలంటే ఈ పాటకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ లో తిరుగులేని చార్ట్ బస్టర్ గా నిలిచిన ఈ రౌడీ బేబీ సాంగ్ ఇప్పట్లో ఏ పాట కూడా బద్దలు కొట్టనీ విధంగా రికార్డులను అందుకుది. దీని తర్వాత అల్లు అర్జున్ అల వైకుంఠ పురం లో ని బుట్ట బొమ్మ సాంగ్ శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. 4.1 మిలియన్ లైక్ లను సాధించి 644 మిలియన్ వ్యూస్ లను క్రాస్ చేసింది ఈ పాట.

మరింత సమాచారం తెలుసుకోండి: