
అయితే వీరిలో ప్రకాష్ రాజ్ కి పోటీ చేసే అర్హత లేదని ఆయన ఇక్కడి పరిశ్రమ వ్యక్తి కాదని ఇటీవల పలువురు ఆయన పై విమర్శలు చేసారు. అయితే నటుడికి, నటనకి భాషతో ప్రాంతంతో సంబంధం లేదని తనకు అన్ని భాషల్లోనూ అందరి నటులతో మంచి పరిచయాలు ఉన్నాయని, ఇక్కడి తెలుగు ప్రజలు తన కుటుంబం వంటి వారని అన్నారు ప్రకాష్ రాజ్. మరోవైపు హేమ, నరసింహారావు లు కూడా తమవంతుగా పోటీ కి సిద్ధం అవుతుండగా, నటుడు విష్ణు మంచు ఇటీవల ఒక సంచలన వీడియో విడుదల చేసారు.
తెలుగు నటుల కష్టసుఖాలు తెలుసుకుని దాన్ని తెలుగువారే ముందుండి నడిపించాలని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ ఒకప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు నడిగర్ సంఘంలోని తెలుగు సినీ కార్మికులు అందరూ ఉండేవారు. నాన్న గారికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో పదవి ఉన్నా లేకపోయినా సరే సినీ జనాల కోసం ఎక్కువగా ఆలోచించారు. మా అసోసియేషన్ లో తప్పులు జరిగి ఉండొచ్చు కానీ ఆ తప్పులను ఉద్దేశపూర్వకంగా చేశారు అని నేను అనుకోనుఆ తప్పులను తవ్వుకుంటూ ఉంటే మనం ముందుకు వెళ్లలేమన్నారు. మా భవన నిర్మాణం తమ ఫ్యామిలీ సొంత ఖర్చులతోనే నిర్మిస్తాం అని, అలానే చిత్ర పరిశ్రమ పెద్దలు మా అధ్యక్షుడి ఏకగ్రీవం కి కృషి చేస్తే తాను స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకుంటా అని లేదంటే పోటీ తప్పదని విష్ణు అన్నారు.
మా అసోసియేషన్ లో కొత్త సభ్యులను చేర్చుకుంటామని, మంచి పనులు ఎలా చేయాలో ఆలోచిద్దాం అంటూ సినీ పెద్దలకు ఆయన సూచించారు. కొన్నేళ్ల క్రితం సినీ కార్మికుల స్థలాన్ని పోరాడి తిరిగి తెచ్చి తన తాద్రి మోహన్ బాబు గొప్పతనాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. మా తెలుగు అసోసియేషన్ లో చిన్న తప్పులు జరిగి ఉండొచ్చని వాస్తవానికి మా కుటుంబం విస్తరించాలి అనేదే తన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. మరి విష్ణు చేసిన ఈ ప్రకటనతో నిజంగానే మాలోని సీనియర్స్ అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుని ఎన్నికలకు ట్విస్ట్ ఇస్తారా లేదా అనేది మరికొన్నాళ్లు గడిస్తేనే కానీ చెప్పలేం అంటున్నారు సినీ విశ్లేషకులు .... !!