మాములుగా సినిమా రంగంలో ఒకసారి కలిసి నటించిన హీరో హీరోయిన్లు మళ్ళీ మళ్ళీ సినిమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ తమిళ సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు నటీ నటులు 28 సంవత్సరాలకు ముందు ఒక సినిమాలో కలిసి నటించారు. మళ్ళీ ఇప్పుడు కలిసి నటించారు. చాలా విచిత్రంగా ఉంది కదూ, చిత్ర సీమ అంటేనే ఒక విచిత్రం. మరి వారెవరో వారు అప్పుడు నటించిన ఇప్పుడు నటిస్తున్న ఆ సినిమా ఏమిటో తెలుసుకుందాము. ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం సినిమా ప్రపంచానికి అందించిన ఒక అందమైన ప్రేమకథాచిత్రం రోజా. ఈ సినిమాలో అరవింద్ స్వామి మరియు మధుబాలలు హీరో హీరోయిన్ లుగా నటించి పాత్రలకు ప్రాణం పోశారు. ఈ సినిమా ద్వారా వీరికి ఎంతో మంచి పేరొచ్చింది. ఇప్పటికీ ఇందులో పాటలను ఆస్వాదించని సినీ ప్రేక్షకుడు లేరంటే నమ్మండి.
సినిమా తర్వాత మళ్ళీ వీరిద్దరికీ కలిసి నటించే అవకాశమే రాలేదు. ఆ అవకాశం మాజీ ముఖ్యమంత్రి మరియు సినీ నటి దివంగత జయలలిత బయోపిక్ ద్వారా వీరిద్దరికీ వచ్చింది. కంగనా రనౌత్ జయలలిత పాత్రలో "తలైవా" సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో అరవింద్ స్వామి ఎంజీఆర్ గా మరియు మధుబాల ఎంజీఆర్ భార్య జానకీ రామచంద్రన్ గా నటిస్తున్నారు. మధుబాలకు సంబంధించిన లుక్ ను చిత్రబృందం విడుదల చేసింది. స్వయంగా అరవింద్ స్వామి మధుబాల కలిసున్నా లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమా షూటింగును పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

 కాగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది. తమిళనాడు రాష్ట్రము మొత్తం అమ్మలా ఆరాధించే జయలలిత జీవిత చరిత్ర కావడంతో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు విజయ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మధుబాల పాత్ర బాగా ఆకట్టుకుంటుందని దర్శకుడు ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. ఈ సినిమా నుండి విడుదలయిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: