టాలీవుడ్ లో కమెడియన్ గా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న తరువాత హీరోగా మారి వరుస సినిమాలతో హిట్ లు కొట్టిన  నటుడు సునీల్. చిత్రం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి కమెడియన్ గా పరిచయమైన సునీల్ ఆ తరువాత ఎన్నో చిత్రాల ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. ఈ క్రమంలోనే ఆయనకు ఒక హీరో కి ఉన్న ఫాలోయింగ్ రావడంతో హీరోగా చేయాలని తొలి ప్రయత్నంగా అందాల రాముడు అనే సినిమా చేశాడు ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత వరుసగా సినిమాలతో హీరో గా బిజీ అయిపోయాడు సునీల్.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న సినిమా ఆయన పూర్తి స్థాయి హీరోగా నిలబెట్టింది. ఆ సినిమా తర్వాత సునీల్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయిందనే చెప్పాలి. అయితే ఆ తర్వాత గాని సునీల్ డౌన్ ఫాల్ మొదలవలేదు. వరుసగా సునీల్ సినిమాలు ఫ్లాప్ అవడంతో ఆయనకు వచ్చిన క్రేజ్ పోయింది. దాంతో ఆయన తిరిగి కమెడియన్ గా చేయాలన్న డిమాండ్ ఎక్కువైపోయింది. హీరోగా సినిమా అవకాశాలు కూడా తగ్గుముఖం పట్టడంతో సునీల్ మళ్లీ కమెడియన్ గా చేయడం మొదలుపెట్టాడు. 

అయితే ఈసారి కేవలం కమెడియన్ గా మాత్రమే కాకుండా హీరోగా కూడా సినిమాలు చేసి సునీల్ తాను ఆల్రౌండర్ అని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో ఆయనకు పెద్ద పెద్ద సినిమాల్లో సైతం మంచి మంచి రోల్స్ వస్తున్నాయట. దీంతో సునీల్ కు మళ్లీ పూర్వవైభవం రావడం ఖాయం అని అనుకుంటున్నారు ఆయన అభిమానులు. తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న f3 సినిమాలో పిసినారి సంఘం అధ్యక్షుడు గా నటిస్తున్నాడట. వెంకటేష్ వరుణ్ తేజ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో మూడవ హీరోగా సునీల్ పేరు చెబుతుండగా ఆహనా పెళ్ళంట సినిమాలో కోట శ్రీనివాసరావు లాంటి అతి పిసినారి పాత్ర చేస్తున్నాడట.  ఈ పాత్ర ఈ సినిమా కే హైలెట్ అవుతుందట. మరి సునీల్ కు ఈ సినిమా ఎంత వరకు బ్రేక్ ఇస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: