ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ తెరంగ్రేటం ఖరారైన విషయం తెలిసిందే. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ "శాకుంతలం" సినిమా ద్వారా అల్లు అర్హ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ రోజు ఉదయం నుంచి ఈ సినిమాకు, ఆమెకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే తాజాగా అల్లు అర్హ మొదటి రోజు షూటింగ్ కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. అందులో అల్లు అర్హ మేకప్ కు సంబంధించిన సన్నివేశాలను చూపించారు. క్యారవాన్ లో మేకప్ వేసుకుంటున్న అర్హా వెనుక ఆమె తండ్రి అల్లు అర్జున్ పోస్టర్ కనిపిస్తోంది. అది "పుష్ప" చిత్రంలోనిది. వీడియో చివర్లో గుణశేఖర్ ఆమెను ఎత్తుకొని విజయ సూచికగా బొటనవేలు చూపిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. 

ఇక ఈ షెడ్యూల్ లో అల్లు అర్హ పాత్రకు సంబంధించిన షూటింగ్ పది రోజుల పాటు జరగనుంది. ఆమె ఈ చిత్రంలో 'భరత్' అనే పాత్రలో నటించబోతోంది. కూతురు ఎంట్రీపై బన్నీ స్పందిస్తూ అర్హను ఈ చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయం చేయడం గర్వంగా భావిస్తున్నాను అని, తాను కలిసి నటించిన సమంత సినిమాలో అర్హ కూడా నటించడం సంతోషంగా ఉందంటూ "శాకుంతలం" టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. గతంలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ మూవీ "రుద్రమ దేవి"లో అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి అనే పవర్ ఫుల్ పాత్రలో కన్పించిన విషయం తెలిసిందే. కాగా అల్లు అర్హ ఈ సినిమాలో నటించడం అనే విషయం బాగానే హైప్ ను పెంచింది. ఇందులో సమంత ప్రధాన పాత్రలో నటిస్తోంది. మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ కూడా ఈ సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: