టాలీవుడ్ లో దర్శకుడు పూరీ జగన్నాథ్ కి ప్రత్యేకమైన స్టైల్ ఉంది. ఆయన తన తొలి సినిమా నుంచి ఎంతో వైవిధ్య భరితమైన సినిమాలు చేస్తూ హిట్ లు కొడుతున్నాడు. స్టార్ హీరోలు ప్రతి ఒక్కరు ఆయనతో సినిమా చేయాలని స్టార్ గా ఎదగాలని చూస్తూ ఉంటారు. ఒక సందర్భంలో ప్రతి ఒక్క హీరో పూరి జగన్నాథ్ తో సినిమా చేయాలని చెప్పారు మన హీరోలు. స్టార్ కావాలనుకునే ప్రతి ఒక్కరూ పూరీ చేతిలో ఉండాల్సిందే అని ఆయనకు కితాబు ఇచ్చారు. ఆ విధంగా ఇప్పుడు ఉన్న చాలా మంది హీరోలను ఆయన స్టార్లుగా మార్చాడు.

పూరి జగన్నాథ్ లోని మరో ప్రత్యేకత ఏమిటంటే ఆయన సినిమాలలో ఉండే హీరో క్యారక్టరైజేషన్ ఏ సినిమా లోనూ ఉండదు. తనకే సాధ్యమైన పాత్రను ఎంతో విభిన్నంగా డిజైన్ చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ఆ విధంగా పూరి జగన్నాథ్ హీరోల పాత్రల చిత్రీకరణలో ఎంతో వైవిధ్యాన్ని చూపిస్తూ  టాప్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. పూరి జగన్నాథ్ లోని మరో విశేషం ఏమిటంటే తాను చేసే సినిమాలను అతి తక్కువ సమయంలో పూర్తి చేయడంతో పాటు ఎంతో ఇంట్రెస్టింగ్ టైటిల్ ను పెట్టడం పూరి జగన్నాథ్ లో ఉన్న మరో ప్రత్యేకత.

హీరోలను బాగా ఎలివేట్ చేయగల పూరి జగన్నాథ్ సినిమా టైటిల్ తోనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే గల దర్శకుడు. పోకిరి, ఇడియట్, నేనింతే, అమ్మ నాన్న తమిళమ్మాయి, ఇష్మార్ట్ శంకర్, లైగర్, టెంపర్, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, బద్రి వంటి చిత్రాల టైటిల్స్ ను గమనిస్తే పూరి జగన్నాథ్ సినిమా టైటిల్స్ పెట్టడంలో ఎంతటి సిద్ధహస్తుడో అర్థమైపోతుంది. ఈ విషయంలో మాత్రం పూరి జగన్నాథ్ ను బీట్ చేసే దర్శకుడు ఇంత వరకు టాలీవుడ్ లో లేడనే చెప్పాలి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు పూరి జగన్నాథ్. పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ మధ్య పూరి జగన్నాథ్ పని అయిపోయింది అనుకున్న వారికి ఇస్మార్ట్ శంకర్ సినిమా తో సరైన సమాధానం చెప్పాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: