మొదటి నుంచి మన టాలీవుడ్ హీరో లు బాలీవుడ్ లో తమను తాము నిరూపించుకోవాలని తమని తాము ఎలివేట్ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా పాతతరం హీరోల దగ్గర నుంచి ఇప్పటి తరం వరకు బాలీవుడ్ లో వచ్చిన సినిమాలు చేస్తూ తమ సత్తా చాటడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది హీరోలు అయితే డైరెక్ట్ బాలీవుడ్ సినిమాలు చేసి అక్కడి ప్రేక్షకుల మెప్పు పొందే ప్రయత్నం కూడా చేశారు. మరి కొంతమంది కొన్ని డబ్బింగ్ సినిమాల ద్వారా వారిని ఒప్పించగలిగారు. ఆ విధంగా ఈ తరం బాలీవుడ్ లో ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతున్న టాలీవుడ్ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం. 

బాహుబలి సినిమా తో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు ప్రభాస్. ఆయన బాలీవుడ్ లో ఆది పోలీస్ సినిమా చేస్తున్నాడు. అంతేకాదు బాహుబలి సినిమా దగ్గర్నుంచి తాను చేసిన ప్రతి సినిమా బాలీవుడ్ లో విడుదల అయ్యే విధంగా చూసుకుంటున్నాడు. గతంలో రానా దగ్గుబాటి కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించాడు. ఇప్పుడు కూడా ఆయన చేస్తున్న కొన్ని సినిమాలు బాలీవుడ్ లో విడుదల అవుతున్నాయి. యంగ్ హీరో నితిన్ కూడా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ బాలీవుడ్ సినిమా చేయగా అది వర్కౌట్ కాక పోవడంతో ఇక ఆ సినిమాల జోలికి వెళ్ళలేదు.

బెల్లంకొండ శ్రీనివాస్ వినాయక్ దర్శకత్వంలో ఛత్రపతి రీమేక్ సినిమాను బాలీవుడ్ లోనే చేస్తున్నాడు. అక్కినేని నాగచైతన్య అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న లాల్ చద్ధా సింగ్ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న రామసేతు అనే సినిమాలో ఓ కీలక పాత్రలో మెరవనున్నా డు. రామ్ చరణ్ కూడా జంజీర్ పేరుతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నాడు. విజయ్ దేవరకొండ కూడా లైగర్ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నాడు. ఎన్టీఆర్ కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: