
టాలీవుడ్ లో దగ్గుబాటి వారి కుటుంబానికి ఉన్న ప్రత్యేకత ఎవరికీ లేదు. స్వర్గీయ దగ్గుబాటి రామానాయుడు నిర్మాతగా ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు తెలుగు సినీ చరిత్ర మరిచిపోలేని చిత్రాలు నిర్మించి నిర్మాతగా తన ముద్రను వేశారు. ఆ తర్వాత ఆయన వారసులు దగ్గుబాటి సురేష్ బాబు, వెంకటేశ్ లు సినిమా ఇండస్ట్రీలో తమతమ విభాగాలలో మేటి అనిపించుకుంటున్నారు. తండ్రి లాగానే దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాతగా పలు మంచి సినిమాలను నిర్మిస్తుండగా వెంకటేష్ మాత్రం హీరోగా తన సత్తా చాటుతున్నాడు.
ఇక దగ్గుబాటి వారి మూడోతరం వారసుడిగా సినిమాల్లోకి వచ్చాడు రానా. ఆయన చేసిన తొలి సినిమాతోనే ప్రేక్షకులను కట్టి పడేశాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లీడర్ అనే సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన రానా ఆ తర్వాత వరుస సినిమాలు చేసి నటుడిగా తనని తాను నిరూపించుకున్నాడు. ఆరడుగుల ఆజానుబాహుడు రానా దగ్గుబాటి బాలీవుడ్ లో తమిళంలో సైతం సినిమాలు చేసి అక్కడ మంచి మార్కెట్ ను ఏర్పర్చుకున్నాడు.
హీరోగా ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించిన రానా దగ్గుపాటి విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా కొన్ని సినిమాలు చేయడం గమనార్హం. నిజానికి బాక్గ్రౌండ్ లో ఉన్న హీరోలు ఎవరు కూడా ఇతర పాత్రల్లో చేయడానికి ఇష్టపడరు కానీ ఆ విధంగా చేసి తనకు సినిమాలపై ఫ్యాషన్ ఎంత ఉందో చెప్పాడు రానా. తాజాగా ఆయన చాలా రోజుల తర్వాత మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో తన ఫ్యూచర్ ప్లాన్స్ ను తాను చేయబోయే సినిమాల విషయాలను వెల్లడించారు. త్వరలో ఆయన సూపర్ హీరోగా నటించబోతున్నాడు అని వెల్లడించాడు. స్వయంగా ఈ విషయాన్ని ఆయనే వెల్లడించడంతో ఈ సినిమా తప్పకుండా ఉంటుందని భావిస్తున్నారు ఆయన అభిమానులు. దీనికి సంబంధించిన విషయాలను మాత్రం వెల్లడించలేదు. గతంలో ఇలా వెరైటీ ప్రయత్నాలు చేయబోయి రానా బొక్క బోర్లా పడ్డాడు. మరి ఈసారైనా ఆయన హీరోగా నిలదొక్కుకుంటాడా చూడాలి.