ఒకప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు అన్నా..ఇప్పుడు సూపర్ స్టార్ అన్నాఆయనలో ఏమాత్రం వయసు తగ్గడం లేదు. ఆయనకు 45 సంవత్సరాలు అవుతున్నాయా అంటే చాలా మంది నమ్మరు. ఎందుకంటే ఆయన చూడటానికి యువకుడిలాగానే ఉంటాడు మరి. యంగ్ లుక్ లో మహేష్ బాబు కనిపించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడుండే తెలుగు హీరోలు ప్రభాష్, దగ్గుబాటి రానా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..ఇలా ఎందరో హీరోలు సిక్స్ ప్యాక్ లు పెంచి, కండలు పెంచి, బాడీని బాగా బిల్డ్ చేసుకుని విపరీతమైన ఫ్యాన్ పాలోయింగ్ ను సంపాదించుకుంటున్నారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు విషయం వచ్చేటప్పటికీ ఆయన వాటినేమీ పట్టించుకోలేదు. కేవలం తన అందంతోనే ఆకట్టుకున్నాడు. తన ఫిజిక్ చూసి ఎవరైనా ఇప్పటికీ ఓ టీనేజ్ బాయ్ లాగానే కనిపిస్తున్నట్లు ఉన్నాడంటూ కామెంట్ చేస్తారు.


మహర్షి సినిమా 25వ సినిమా అయినప్పటికీ ఆయన ఒక యంగ్ ఎనర్జిటిక్ బాయ్ లాగానే కనిపించాడు. ప్రస్తుతం ఆయన ఓ యాడ్ షూట్ చేస్తున్న ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మహేష్ బాబు థమ్స్ అప్ యాడ్  చేస్తున్నాడు. అందులో ఆయన ఓ టీనేజ్ బాయ్ లాగా ఉన్నాడు. ఆయన్ని చూసి ఎవరైనా  సరే చిన్నపిల్లాడే అనుకుంటారు. ఆ ఫోటోను చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణకు అన్నయ్యలాగా ఉన్నావంటూ అభిమానులు కామెంట్ పెడుతున్నారు. థమ్స్ అప్ బాటిల్ ను ఖాళీ చేసి ఆ బాటిల్ ను పట్టుకుని ఉండే ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. థమ్స్ అప్ కంపెనీ ప్రిన్స్ మహేష్ బాబుతో అనేక యాడ్స్ ను చేసింది. ఇది వరకూ రణవీర్ సింగ్ తో కలిసి యాడ్ చేశాడు. మళ్లీ సింగిల్ గా ఇప్పుడు ఇంకో థమ్సప్  యాడ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ యాడ్ కు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ గా చెక్కర్లు కొడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: