
సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా బాలనటుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించి ఎన్నో సినిమాల్లో నటించి రాజకుమారుడు సినిమాతో పూర్తిస్థాయి హీరోగా మారాడు. ఆ తర్వాత వరుస హిట్లతో సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగాడు. తొలుత ప్రిన్స్ మహేష్ బాబు గా పిలువబడిన మహేష్ పోకిరి సినిమా హిట్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు గా పిలువబడుతున్నాడు. మహేష్ బాబు కెరీర్ లోనే పోకిరి సినిమా ఎన్ని సంచలనాలను సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా తాలూకు రికార్డులను ఏ సినిమా కూడా బద్దలు కొట్టక పోవడం విశేషం.
ప్రస్తుతం టాలీవుడ్ లో అందరు హీరోలు పాన్ ఇండియా మార్కెట్ కోసం ట్రై చేస్తూ దానికి సంబంధించిన పాన్ స్పాన్ ఉన్న సినిమాలను మాత్రమే చేసుకుంటూ పోతున్నారు. కానీ మహేష్ మాత్రం అవేవీ పట్టనట్టుగా తన సినిమాలు తను చేసుకుంటూ పోతున్నాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే సినిమా చేస్తాడు అలాంటి కథనే ఎంచుకుంటాడు అని అనుకున్నారు అభిమానులు. కానీ సర్కార్ వారి పాట అనే సినిమా చేయడం అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యం కలిగించింది.
అయితే ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ సినిమా అని అనేవారు లేకపోలేదు. మరోవైపు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. ఆ సినిమా తో పాటే రాజమౌళి తో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. తాజాగా ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం రాజమౌళితో ఆఫ్రికన్ నవల ఆధారంగా మహేష్ బాబు సినిమాను తెరకెక్కిస్తున్నాడట. ఈ నవలకు సంబంధించిన హక్కులు ఇప్పటికే రాజమౌళి దక్కించుకున్నారట. ఈ కథతోనే మహేష్ బాబు తో చేయనున్నాడట రాజమౌళి. అయితే మహేష్ బాబు అభిమానులు మాత్రం ఈ విషయంపై కాస్త నిరాశ ఉన్నట్లు తెలుస్తోంది. అందరు హీరోలకు పవర్ఫుల్ ఒరిజినల్ కథను సొంతంగా రాసి మహేష్ బాబు కు మాత్రమే నవలను కాపీ చేయడం ఎందుకు అని వారు ఇండైరెక్ట్ గా ప్రశ్నిస్తున్నారు.