టాలీవుడ్ సినీ పరిశ్రమలో హీరోయిన్ లు స్టార్ హీరోయిన్లుగా రాణించాలన్నా సినిమాలలో నటించే అవకాశం పొందాలన్న ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. సినిమా అవకాశాలు రాక ముందు వారి ప్రవర్తన ఎలా ఉన్నా సినిమాల లో స్టార్ గా ఎదిగిన తరువాత వారి ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది. గ్లామర్ చేయడం దగ్గర నుంచి నటించడం దాకా ప్రతి ఒకటి వార వారిలో మార్పు స్పష్టంగా తెలుస్తుంది అయితే టాలీవుడ్ సినీ పరిశ్రమలో పరిస్థితి ఎలా ఉంది అంటే హీరోయిన్లను కేవలం గ్లామర్ కు మాత్రమే తీసుకుంటున్నారు అని అనిపిస్తుంది.

హీరో ప్రధానమైన కథలు ఎక్కువగా పుట్టుకొస్తుండడం తో ఈ తరహా విధానం గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. ఆ విధంగా టాలీవుడ్ సినీ పరిశ్రమలో గ్లామర్ ని ఎంకరేజ్ చేయని హీరోయిన్ లు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళలో ఒకరు కీర్తి సురేష్. నేను శైలజ సినిమా తో టాలీవుడ్ కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మంచి  పాత్ర తో తన కెరీర్ ను టాలీవుడ్ లో మొదలుపెట్టి విభిన్నమైన పాత్రలు చేసుకుంటూ ఎక్స్పోజింగ్ అంటే ఆమడ దూరం పరుగెడుతుంది.. ప్రస్తుతం పెద్ద పెద్ద సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తుంది. ఆమె కు మహానటి సినిమా తెచ్చిన కీర్తిప్రతిష్టలు అంతా ఇంత కాదు. ఆ సినిమా తో జాతీయ స్థాయి నటిగా మారింది కీర్తి.. 

నేను లోకల్, అజ్ఞాతవాసి వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కీర్తి సురేష్ ప్రస్తుతం మహేష్ బాబు సరసన  సర్కారు వారి పాట సినిమాలో అవకాశం కొట్టేసింది. అంతేకాదు కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలను సైతం చేస్తూ హీరోలకు దీటుగా కొనసాగుతుంది  కీర్తి సురేష్. మలయాళ తమిళ భాషల్లో సైతం సినిమాలు చేస్తూ అక్కడ కూడా స్టార్ యాక్టర్ గా నిలిచింది. ఏదేమైనా గ్లామర్ షో విషయంలో అంత బెట్టు చేస్తున్నా మన దర్శక నిర్మాతలు ఆమెకు పెద్ద పెద్ద సినిమా ఛాన్స్ లు ఇస్తుండడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: