తెలుగులో మల్టీస్టారర్ సినిమాల హవా పెరిగిందనే చెప్పవచ్చు. మొదట ఈ జనరేషన్లో వెంకటేష్, మహేష్ బాబు కలిసి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో ప్రారంభిస్తే దానిని చాలా మంది ఫాలో అవుతూ వస్తున్నారు. ఈ కోవలోనే వెంకటేష్, పవన్ కళ్యాణ్ కలిసి 'గోపాల గోపాల' సినిమాతో మంచి హిట్ కొట్టారు. వెంకటేష్ రామ్ లు కూడా 'మసాలా' సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నారు . ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా కూడా మల్టీస్టారర్ సినిమా అన్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రస్తుతం మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌' సినిమాను తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా తెరకిస్తున్నారు.


ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే సంభాషణలు అందిస్తున్నాడు. ఈమధ్య ఈ సినిమాకు సంబంధించిన పవన్ కళ్యాణ్ లుక్ ని కూడా రివీల్ చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో ఉన్నాడు. సినిమాలో పవన్ కళ్యాణ్ పేరు భీమ్లా నాయక్ గాచూపించారు ప్రస్తుతం ఈ పేరు నెట్టింట్లో ట్రెండింగ్ గా మారింది. ఇదిలా ఉండగా ఈ సోమవారం రోజు పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఆ సందర్భంగా పవన్ తో షూటింగ్ ఎక్స్పీరియన్స్ ను పంచుకుంటూ రానా పవన్ పై పొగడ్తల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తాను అని ఊహించలేదు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆయన నటించడాన్ని చూస్తేనే ఆయనకు నటనలో ఎంతో అనుభవం ఉందో తెలిసిపోతుంది. పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఒక గొప్ప పుస్తకం లాంటివారు, పుస్తకం తో ఎందుకు పోల్చాను అంటే పుస్తకం మనకు ఎన్నో గొప్ప లక్షణాలను నేర్పిస్తుంది అని రానా తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: