టాలీవుడ్ సినీ పరిశ్రమ ఇప్పుడు చాలా మారిపోయింది. భారీ బడ్జెట్ చిత్రాలు సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా టాలీవుడ్ సినిమా పరిశ్రమ నిలుస్తుంది. దేశంలోనే అగ్రగామి సినిమా పరిశ్రమగా రోజురోజుకు ఎదుగుతున్న టాలీవుడ్ సినిమా పరిశ్రమ గతంలోకి వెళితే వందకోట్ల సినిమాల నిర్మాణాలను చేయడానికి కూడా ఎంతో ఇబ్బంది పడేది. 50 కోట్ల మార్కు చేరుకుంటే అదే పెద్ద గొప్ప ఆ రోజుల్లో. 50 కోట్లే అన్నట్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీ వంద కోట్లను కూడా అవలీలగా దాటి పైకి వెళుతుందని ఎవరూ అనుకోలేదు.

బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ సినిమా పరిశ్రమ ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇండస్ట్రీ రికార్డులు మాత్రమే కాదు ఇండియన్ సినిమాల రికార్డులను కూడా తిరగరాసిన బాహుబలి మొదటి పార్ట్ 183 కోట్ల రూపాయల కలెక్షన్లను తీసుకురాగా రెండో పార్ట్ 310 కోట్ల కలెక్ట్ చేసింది. ఈ సినిమా రికార్డులను అందుకోవడం మళ్లీ రాజమౌళికి కూడా సాధ్యం కాకపోవచ్చు. ఆ విధంగా టాలీవుడ్ లో వంద కోట్ల మార్క్ అందుకున్న సినిమా ఏంటో ఇప్పుడు చూద్దాం. 

సినిమా ఘనత కూడా రాజమౌళి కే దక్కుతుంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమా 100 కోట్ల మార్కును అందుకున్న తొలి టాలీవుడ్ సినిమా గా చెప్పవచ్చు. రామ్ చరణ్ చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చి నటనలో డాన్స్ లలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగా రెండో సినిమా తోనే 100 కోట్ల మార్కును అందుకునే హీరో గా రికార్డులకెక్కాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ మూవీ 2009వ సంవత్సరం జూలై 31న విడుదల కాగా ప్రపంచ వ్యాప్తంగా 1200 థియేటర్లలో రిలీజ్ అయి 223 సెంటర్లు 100 రోజులు పూర్తి చేసుకుంది.  39 కోట్ల బడ్జెట్ కి 125 కోట్ల గ్రాస్,  వందకోట్లు కలెక్ట్ చేసిన తొలి తెలుగు మూవీ గా నిలిచింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: