సూర్య హీరోగా అపర్ణ బాలమురళి హీరోయిన్ గా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'సూరరై పోట్రు' తెలుగులో (ఆకాశమే నీ హద్దురా). హీరో సూర్యసినిమా విడుదలకు ముందు వరుస అపజయాలతో డీలా పడిపోయాడు. ఈ సినిమా విడుదలైన తర్వాత సూర్య కు విజయంతో పాటు  విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఈ చిత్రం ఆస్కార్ బరిలో కూడా నిలిచింది. ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలనే ఉద్దేశంతోనే నిర్మించారు. కాకపోతే భారతదేశంలో కరోణ విజృంభించడంతో థియేటర్లు మూత పడ్డాయి. చాలా రోజుల పాటు సినిమా థియేటర్లలో విడుదల చేయాలని ఉద్దేశంతో వేచి చూశారు. కానీ థియేటర్లు ఎప్పుడూ తెరుచుకుంటాయి అనే దానిమీద  స్పష్టత లేకపోవడంతో సినిమాను ఒక ప్రముఖ 'ఓటీటీ' సంస్థకు అమ్మివేశారు.


 ఈ సినిమా పోయిన ఏడాది విడుదల అయింది. ఈ చిత్రాన్ని ప్రస్తుతం హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ఏదో ఒక రకంగా ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంది. ప్రస్తుతం కూడా ఈ చిత్రం ఒక రేర్ ఫీట్ ని అందుకుంది. ఈ సినిమా విషయంలో  కథ కథనాలు ఎంత ముఖ్యమైన పాత్రను పోషించాయో, పాటలు కూడా అంత ముఖ్యమైనవి అని చెప్పవచ్చు. ఈ సినిమాకు సంగీతాన్ని అందించింది తమిళ యువ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్. ప్రస్తుతం ఈ సంగీత దర్శకుడు ఈ సినిమా కోసం చేసిన పాటలలో 'కాటుక కనులే' అనే పాట 100 మిలియన్ల వ్యూస్ ని అందుకుంది. ఈ పాటను ఇంత గొప్పగా అద్భుతంగా రాసిన భాస్కరభట్ల, ఈ పాటను పాడిన తమిళ సింగర్  ఢీ, స్వరాలు సమకూర్చిన జీవీ ప్రకాష్ కుమార్, కొరియోగ్రఫీ చేసిన శోభీ, శేఖర్ మాస్టర్, దర్శకత్వం వహించిన సుధా కొంగర ఇలా అందరి ప్రతిభ వల్లే ఈ పాట ఇంతలా జనాలను ఆకట్టుకుంటుంది. ఓ సందర్భంలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాటల రచయిత భాస్కరభట్ల ఈ పాటను రాసిన విధానాన్ని, అందులో పదాల వాడకం గురించి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: