
సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్నారు. ఇక తరచు సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ తన ఫ్యామిలీ కి సంబందించిన పలు విషయాలు సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకునే అలవాటు గల అల్లు అర్జున్, ఇటీవల తనయ అర్హ సినిమా అరంగేట్రం తాలూకు విషయాన్ని అందరికీ వెల్లడించారు. సమంత ప్రధాన పాత్ర చేస్తున్న శాకుంతలం సినిమాలో అర్హ ఒక చిన్న పాత్ర చేస్తుందని ఆయన తెలిపారు. అలానే తనయుడు అయాన్ కి సంబందించిన పలు ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటారు అల్లు అర్జున్. ఇక నేడు అయాన్ ఫస్ట్ డే స్కూల్ ఆన్ లైన్ క్లాస్ చూస్తున్న వీడియో ని పోస్ట్ చేసారు.
ఎంతో శ్రద్దగా అయాన్ ఆన్ క్లాసెస్ వింటున్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుండగా, అయాన్ రాబోయే రోజుల్లో చక్కగా చదువుకుని మంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలని పలువురు ప్రేక్షకులు, అల్లు అర్జున్ అభిమానులు అతడికి అభినందనలు తెలియచేస్తూ తమ హృదయపూర్వక ఆశీర్వాదాలు తెలియచేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ పుష్ప మొదటి భాగం క్రిస్మస్ కి విడుదల కానుండగా రెండవ భాగాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయనున్నట్లు సమాచారం ..... !!