చాలా మందికి సినిమా పరిశ్రమ అంటేనే ఒక పిచ్చి ఉంటుంది. ఈ సినిమా పరిశ్రమలో ఏదో ఒక విధంగా భాగం కావాలని ఉవ్విళ్లూరుతుంటారు. కానీ తామొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందని, కొందరు అనుకున్న విధంగా మంచి స్థాయికి చేరుకుంటారు. కొందరేమో అనుకున్నది జరగక ఫెయిల్ అవుతుంటారు. అలా వచ్చిన ఒక రైటర్ అనుకోకుండా జబర్దస్త్ లాంటి కామెడీ షోలో అవకాశం దక్కించుకుని, ఇప్పుడు కోట్లాదిమంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అతనెవరో కాదు హైపర్ ఆది అతని పంచులు వింటే ఎవ్వరికైనా నవ్వు రాక తప్పదు. ఎంత బాధలో ఉన్నా హైపర్ ఆది స్కిట్ చూస్తే హ్యాపీగా నవ్వుకుంటారు. స్వతహాగా అతను రైటర్ కావడంతో తన స్కిట్ లను తానే రాసుకుంటుంటాడు.
ఇతని కామెడీకి చిరంజీవి, బ్రహ్మనందం లాంటి వారు మెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా మెల్లగా కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వెళుతున్నాడు. ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేయడానికి అవకాశం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ వెబ్ సిరీస్ కు కథను తానే అందిస్తున్నాడు. ఈ కథను ఒక నిర్మాతకు వినిపించడంతో ఇది సినిమా కన్నా, ఒక వెబ్ సిరీస్ కి బాగుంటుందని సలహా ఇచ్చారట, అంతే కాకుండా అతన్నే డైరెక్ట్ చేయమని చెప్పడంతో కొంచెం అలోచించి ఓకే చెప్పాడని సమాచారం. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ స్టార్ట్ అవనుందట. ఈ విషయం తెల్సిన హైపర్ ఆది ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

 ఇది జబర్దస్త్ నటీనటులకు ప్లస్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఈ వెబ్ సిరీస్ లో వారిని పాత్రలుగా తీసుకుంటాడని అనుకుంటున్నారు. అయితే ఆ నిర్మాత ఎవరు ? వెబ్ సిరీస్ కథ ఏంటి ? అన్న పూర్తి వివరాలు తెలియాలంటే కాబోయే డైరెక్టర్ హైపర్ ఆది నోరు విప్పితేనే తెలుస్తుంది. మరి చూద్దాం త్వరలోనే ఆది గుడ్ న్యూస్ చెబుతాడేమో. ప్రస్తుతానికయితే చక్కగా జబర్దస్త్ స్కిట్ లు చేసుకుంటూ, సినిమాల్లో వచ్చిన అవకాశాలను చేసుకుంటున్నాడు.    

మరింత సమాచారం తెలుసుకోండి: