ఈశ్వర్ సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయమైన ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయి హీరో అవుతాడని అప్పుడు ఎవరు అనుకోని ఉండరు. ఈ రేంజ్ లో ప్రభాస్ ఎదగడానికి ఆయన స్వయం కృషి ముఖ్య కారణమని చెప్పవచ్చు. ఎవరు ఊరికే స్టార్లు కారు అన్నదానికి ప్రభాస్ కష్టమే ఉదాహరణ. ఓ అనామకుడు గా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా నిలదొక్కుకుని స్టార్ హీరోగా ఎదిగి ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మారాడు. దానికోసం ఆయన ఎంత కష్టపడ్డాడో ఆయనకు మాత్రమే తెలుసు. దేశం గర్వించదగ్గ హీరోగా ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు ప్రభాస్.

బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ రేంజ్ చాలా మారిపోయింది అని చెప్పవచ్చు. ఆయన చేస్తున్న సినిమాల బడ్జెట్లు కూడా ఎంతగానో పెరిగిపోయాయి. మినిమం ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే కానీ ప్రభాస్ సినిమా చేయట్లేదు అంటే  ఆ రేంజ్ లో ప్రభాస్ కీర్తి ప్రతిష్టలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు అన్ని ఆ రేంజ్ బడ్జెట్ సినిమాలే. ఆయన నటిస్తున్న తాజా చిత్రం రాధే శ్యామ్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

పాన్ ఇండియా ఇమేజ్ తో పాటు సోషల్ మీడియా  లో  కూడా ప్రభాస్ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ తన క్రేజ్ పెంచుకున్నాడు . తనకు సంబంధించిన అప్ డేట్ లను అందులో పొందుపరుస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. కాగా తన సోషల్ మీడియా అకౌంట్ ఇంస్టాగ్రామ్ లో ఐదుగురిని మాత్రమే ఆయన ఫాలో అవుతున్నారు. వారిలో ముగ్గురు హీరోయిన్స్ కాగా ఒకరు సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ఇంకొకరు సాహో సినిమా దర్శకుడు సుజత్. ఇంతకీ ఆ ముగ్గురు హీరోయిన్ లు ఎవరు అనుకుంటున్నారా శ్రద్ధాకపూర్ పూజాహెగ్డే మరియు దీపికా పడుకొనే. ఈ ముగ్గురు ముద్దు గుమ్మలను ప్రభాస్ ఫాలోఅవుతున్నాడు. ఈ ముగ్గురు ప్రభాస్ తో నటించిన హీరోయిన్ లే కావడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: