
మరికొంత మంది బండ్ల మరో తప్పు చేస్తున్నాడు అంటున్నాడు. దానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే బండ్ల గణేష్ కు ఇప్పుడున్న పరిస్థితిలో సోషల్ మీడియా ఒక్కటే ఆధారం. ఆయన వార్తల్లో నిలవాలన్నా, ఏదైనా చెప్పాలనుకున్నా...! కొంతకాలం నుంచి సోషల్ మీడియా కారణంగానే బండ్ల గణేష్ ఇంకా ఇండస్ట్రీలో ఉన్నాడు అనే విషయాన్ని గుర్తిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ సోషల్ మీడియానే బండ్ల వద్దనుకుంటే ఆయనకున్న ఈ కాస్త గుర్తింపు కూడా మసకబారిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
నిర్మాతగా ఆయన చివరగా 2015లో జూనియర్ ఎన్టీఆర్ తో "టెంపర్" చిత్రాన్ని నిర్మించారు. ఆ తరువాత మరే ఇతర ప్రాజెక్ట్ ను ఆయన చేపట్టలేదు. పవన్ కళ్యాణ్ తో సినిమా అంటున్నారు. కానీ ఇప్పుడు దానిపై కూడా ఎలాంటి అప్డేట్ లేదు. కొంతకాలం రాజకీయాల్లో కాలక్షేపం చేసి, పలు సినిమా డైలాగులతో కామెడీగా మారాడు. ఆ తరువాత రాజకీయాలు తనకు కలిసి రావని చెప్పి మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల "సరిలేరు నీకెవ్వరు"లో హాస్యనటుడిగా ఇండస్ట్రీలోకి తిరిగి వచ్చాడు. అయితే అతని పాత్ర పెద్దగా క్లిక్ అవ్వలేదు. వృత్తిపరంగా బండ్ల గణేష్ కెరీర్ ఇప్పుడు ఏమంత బాలేదు.
సోషల్ మీడియాలో ఆయన చేసే ట్వీట్ల ద్వారా మాత్రమే నెటిజన్లకు బండ్ల గుర్తుకు వస్తాడు. వాస్తవానికి బండ్ల గణేష్‌కు ట్విట్టర్‌లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. చేతిలో ప్రాజెక్ట్‌లు లేనప్పటికీ ఆయన ట్వీట్‌ల ద్వారా మాత్రమే గత కొన్నిరోజులు వెలుగులో నిలిచాడు. ఇప్పుడు ఆయన గనుక సోషల్ మీడియాను విడిచి పెట్టాలని నిర్ణయించుకుంటే అది ఖచ్చితంగా ఆయన చేసే మరో పెద్ద తప్పు అవుతుంది. ఎందుకంటే ఆయన సోషల్ మీడియాకు దూరమైన మరుక్షణం నుంచే ఫేడ్ అవుట్ అయిపోతాడు. జనాలు అతన్ని మరిచిపోవడం ఖాయం. మరి ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు... బండ్ల నిర్ణయం మార్చుకుంటే మంచిదని నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు.