
మెగాస్టార్ వారసుడిగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలోకి చిరుత సినిమాతో అరంగేట్రం చేసి ఆ తరువాత మగధీర సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు సృష్టించాడు. ఆ సినిమా నెలకొల్పిన రికార్డులు అన్ని ఇన్ని కావు. ప్రేక్షకులను సరికొత్త లోకం లోకి తీసుకు వెళ్ళిన ఆ సినిమా ఆ తర్వాత ఎన్నో చిత్రాల ద్వారా రామ్ చరణ్ భారీ గా అభిమానులను సంపాదించుకున్నాడు. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రేక్షకులను అందరినీ ఎంతగానో అలరించారు తన సినిమా లతో.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. ఎన్టీఆర్ కూడా మరో కథానాయికగా నటిస్తుండగా, రామ్ చరణ్ ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారడం ఖాయం అని అంటున్నారు. పాన్ ఇండియా మార్కెట్ తెచ్చుకోవాలని తన సినిమాలను రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో తన కెరియర్ను మలుచుకున్నాడు. రాజమౌళితో సినిమా తరువాత దక్షిణాదిన భారీ దర్శకుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న శంకర్ తో సినిమా చేయనున్నాడు. ఆ తరువాత కూడా బాలీవుడ్ డైరెక్టర్లతో సినిమా చేయనున్నాడు.
ఇక మెగా హీరోలలో టాప్ హీరోగా ఉన్న రామ్ చరణ్ తర్వాత ఏ హీరో కూడా ఆ రేంజ్ లో సినిమాలను సెట్ చేసుకోలేకపోతున్నాడు. అల్లు అర్జున్ కొంతవరకు ఆ ప్రయత్నం చేస్తున్న కూడా లోకల్ దర్శకులకే ఎక్కువగా అవకాశాలు ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నాడు కానీ పాన్ ఇండియా దర్శకులను మాత్రం ఎంపిక చేసుకోలేక పోతున్నాడు. అలాగే వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అలాగే వైష్ణవ్ తేజ్ కూడా ఇప్పుడిప్పుడే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నాడు అంటే చేస్తున్నట్టే కనిపిస్తున్నాడు. రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆయన దృష్టంతా అక్కడే ఉండటంతో కేవలం అభిమానుల కోసం మాత్రమే సినిమాలు చేస్తుండడంతో రామ్ చరణ్ రేంజ్ లో సినిమా లు సెట్ చేసుకోలేక పోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి సైతం పాన్ ఇండియా సినిమాలు చేయడానికి మొగ్గు చూపుతున్నాడు.