సినిమా పరిశ్రమలో కొన్ని సినిమాలు ఎంతటి వివాదాల్ని సృష్టిస్తాయి అంటే రక్తపాతాల దాకా ఆ వివాదాలు వెళతాయి. సదరు సినిమాలో ఏ చిన్న అభ్యంతరకరమైన డైలాగ్ ఉన్న కూడా కొంతమంది మనోభావాలు ఇట్టే దెబ్బతింటాయి. దాంతో వారు తమ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ సదరు సినిమా పై ధర్నాలు రాస్తారోకోలు చేయడానికి ముందుకు వస్తారు. సాధారణంగా ఒక సినిమాను తెరకెక్కించాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి సినిమా ఒక సామాజిక వర్గాన్ని కించపరచకుండా, కులాన్ని హేళన పరచకుండా, ప్రాంతీయ భాషను దిగజార్చే విధంగా ఉండకుండా చూడాలి.

ముఖ్యంగా నాయకుల విషయంలో, ప్రతి నాయకుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఆ సినిమాపై పెద్ద ఎత్తున నిరసనలు వివాదాలు వస్తాయి. ఆ సినిమాను విడుదల కాకుండా చేస్తారు కొన్ని సార్లు, ఒక వేళ విడుదలైన కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాయి సదరు కంట్రవర్షియల్ సినిమాలు. అయితే అలాంటి సినిమాలు టాలీవుడ్ లో బోలెడు ఉనాయి. వీటిలో మెగాస్టార్ చిరంజీవి సినిమా కూడా ఉందన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన హీరోగా నటించిన అల్లుడా మజాకా సినిమా సూపర్ హిట్ అయినా పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అయ్యింది.

ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో 1995 లో రమ్యకృష్ణ రంభ ఊహా హీరోయిన్లుగా కోటి సంగీత దర్శకత్వంలో తెరకెక్కిన అల్లుడా మజాకా సినిమా మా లో అత్తా అల్లుళ్ళ మధ్య ఉండాల్సిన సరదా అల్లరి హద్దులు దాటి పోయాయని అప్పట్లో మహిళా సంఘాలు రోడ్ల మీదకు వచ్చి ఈ సినిమాపై నిరసనలు తెలిపారు. ఈ సినిమా విడుదలైన తర్వాత మహిళలను అభ్యంతరకరంగా చూపించారని సినిమాను నిషేధించాలని కోరారు. దాంతో ఈ సినిమా విడుదలైన రెండు నెలల తర్వాత సెన్సార్ బోర్డు వారు నిషేధించారు. అందుకు వ్యతిరేకంగా చిరంజీవి అభిమాన సంఘాలు హైదరాబాద్ లో ధర్నా నిర్వహించారు. దాంతో వారు నిషేధాన్ని వెనక్కి తీసుకొని ఈ సినిమాలోని కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు తీసివేసి ప్రదర్శించవచ్చని అనుమతి ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: