
ఇక దేశమంతా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటుంటే మరోవైపు రమ్య శ్రీ హత్యకు గురికావడం మాయని మచ్చగా మిగిలిపోయింది. దీన్నే స్వాతంత్య్రం అనుకోవాలేమో! తొందరగానే నిందితుడిని పట్టుకున్న పోలీసులు స్థానికులు ఘటన జరుగుతున్నప్పుడు స్పందించి ఉంటే ఆమె బ్రతికేది అని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఏం జరిగినా మాకెందుకులే అనుకుని చోద్యం చూసే ఈ జనాలకు వారి దాక వస్తే కానీ అర్థం కాదు. కానీ అంత లోపు ఎంతమంది రమ్యశ్రీ లను బలి తీసుకుంటారో... అమ్మాయిలకు ఈ సమాజంలో భద్రత లేదు. సోషల్ మీడియాలోనూ ఏమాత్రం రక్షణ లేదు. ఎటు తిరిగి అమ్మాయిల్ని టార్గెట్ చేస్తున్నారు. ప్రపంచంలో ఆడవాళ్ళు దేశాన్ని ఏలే స్థాయిలో అభివృద్ధి జరిగినా రక్షణ మాత్రం ఇంకా వెనకబడి పోయే ఉంది. నిందితుడికి గట్టి శిక్ష పడేదాకా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల ఆగ్రహం తగ్గేలా కనిపించడం లేదు. మరో రమ్యశ్రీ ప్రాణాలు పోగొట్టుకోక ముందే ఈ ఘటనపై ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటే బాగుంటుందని అంతా భావిస్తున్నారు.