ఇందులో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయం చేశాడు. కొడుకు మరియు తండ్రి పాత్రల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని రెట్టింపు చేసుకున్నాడు. చిరంజీవికి జోడీగా మీనా నటించింది. ఇతర పాత్రల్లో విజయ్ కుమార్, ప్రకాష్ రాజ్, సితార, కోట, తదితరులు నటించారు. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు కె యస్ రవికుమార్ తెరకెక్కించారు. ఈ సినిమా పూర్తిగా కుటుంబంలోని బంధాలను, ఆప్యాయతలను ఒక వైపు చెబుతూనే సమాంతరంగా స్నేహం యొక్క గొప్పతనం మరియు విలువను తెలియచేశాడు. ఇందులో తండ్రి పాత్రలో చేసిన చిరంజీవి మరియు మీనా తండ్రి విజయ్ కుమార్ ల మధ్య వచ్చే సన్నివేశాలు కంటికి కనువిందు చేస్తాయి. ఈ చిత్రంలో ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షించేది వీరిద్దరి నటన మరియు వారి స్నేహ బంధం.

సినిమా క్లైమాక్స్ లో జరిగిన ఫైట్ లో తండ్రి పాత్రలో ఉన్న చిరంజీవి చనిపోతాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని స్నేహితుడు విజయ్ కుమార్ గుండెలు పగిలేలా ఏడుస్తూ తను కూడా స్నేహితుడి లేని ఈ లోకాన్ని విడిచి స్నేహితుడి కోసం ప్రాణాలను వదిలేస్తాడు. కొడుకు పాత్రలో నటించిన చిరంజీవి కొంచెం ఆవేశం గల పాత్రలో మొదట్లో తన నాన్నను అర్థం చేసుకోక పోయినా తర్వాత నిజం తెలిసి చాలా బాధపడుతాడు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ప్రకాష్ రాజ్ ఎప్పటి లాగే ఆకట్టుకున్నాడు. ఇక మిగతా పాత్రలలో చేసిన వారంతా పరిధి మేరకు నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి