టాలీవుడ్ సినిమా పరిశ్రమలో పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ కు భారీ క్రేజ్ ఉంది. వీరిద్దరి కలయికలో ఎన్నో సినిమాలు రాగా ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా వీరి సినిమాలు చూస్తూ ఉంటారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా లు సూపర్ హిట్ గా నిలవగా ఇప్పుడు వారిద్దరి కాంబినేషన్లో మరో చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు సైతం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా చేస్తూనే మరోపక్క క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు కూడా చేస్తున్నాడు.
ఈ రెండు సినిమాలు విడుదల తేదీలు కూడా ఇప్పటికే కన్ఫార్మ్ కాగా ఈ రెండు సినిమాల తర్వాత ఆయన చేయబోయే సినిమాల పై ఇప్పటికే ప్రేక్షకులకు ఓ క్లారిటీ వచ్చింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా ఉండగా మరొకటి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతుంది. ఈ రెండు చిత్రాలు పక్కా కమర్షియల్ మాస్ చిత్రాలుగా తెరకెక్కబోతున్న అని తెలుస్తుంది. హరీష్ శంకర్ తో గతంలో ఓ సినిమా చేసిన పవన్ కళ్యాణ్ మొదటి సారి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ రెండు చిత్రాల పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ రెండు సినిమాల తరువాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తారని వీరిద్దరి అభిమానులు ఎదురు చూస్తూ ఉండగా వీరిద్దరి కలయికలో చిత్రం కోసం ఇప్పటినుంచే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు తో సినిమా చేస్తున్నా త్రివిక్రమ్ ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో సినిమా అనుకుంటున్నాడు ఈ రెండు సినిమాలు పూర్తి చేసే లోపు పవన్ కళ్యాణ్ కూడా తన సినిమాను పూర్తి చేసి త్రివిక్రమ్ తో సినిమా చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో జల్సా అత్తారింటికి దారేది అజ్ఞాతవాసి వంటి సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఎలాంటి సినిమా రాబోతుంది అనేది చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి