ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.. ఇక సాయి ధరంతేజ్ కు జరిగిన యాక్సిడెంట్ గురించి పలువురు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా జరిగిన ప్రమాదానికి చింతిస్తూ స్పందించడం జరుగుతోంది.. ఇక ఆయన అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా సాయి ధరంతేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.. పోతే సాయి ధరమ్ తేజ్ ఆక్సిడెంట్ ను, వారి తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని ఇటీవల బాబు మోహన్ కూడా పలు వ్యాఖ్యలు చేస్తూ ఆయన ఎమోషనల్ అయ్యాడు..
ఇందుకు కారణం బాబు మోహన్ కుమారుడు కూడా తనకు ఇష్టమైన స్పోర్ట్స్ బైక్ నడుపుతూ.. ప్రమాదానికి గురై మరణించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు.. ఇక అంతే కాదు ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు.. ఇక సాయి ధరంతేజ్ తల్లిదండ్రుల బాధను కూడా అర్థం చేసుకోగలను అంటూ ఆయన తెలిపాడు.. అంతేకాదు ఎవరు కూడా సరదా కోసం మీ ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని ఆయన హెచ్చరించారు.. ముఖ్యంగా మరణించిన వారు బానే పోతారు.. వారిని ఇష్టంగా ప్రేమించే వారు ఎప్పటికీ మర్చిపోలేక జీవితాంతం కుమిలి పోవాల్సి వస్తుంది..
ఇక అంతే కాదు ఒక తండ్రిగా ఒక కుమారుడిని కోల్పోయిన నాకు మాత్రమే ఈ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది..ఇకపోతే తేజ్ హెల్మెట్ పెట్టుకొని చాలా మంచి పని చేసాడు.. ఇక ప్రతి ఒక్కరు కూడా బైక్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అని ఆయన సూచించాడు. అందరూ జాగ్రత్తగా ప్రయాణించాలి అంటూ కూడా ఆయన సూచించడం జరిగింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి