తెలుగు తమిళ చిత్రాల్లో కొన్ని సంవత్సరాలు అగ్రకథానాయికగా సినిమా పరిశ్రమను ఏలిన నటీమణి భానుప్రియ. పంతొమ్మిది వందల ఎనభై మూడు తొంభై మధ్యకాలంలో ప్రేక్షకులను తన నటనతో ఎంతగానో ఉర్రూతలూగించింది. అంతేకాదు బాలీవుడ్ చిత్రాలలో కూడా ఆమె నటించి తన సత్తా చాటుకుంది. 1967వ సంవత్సరంలో జన్మించిన భానుప్రియ భారతదేశ శాస్త్రీయ నృత్యం కూచిపూ డి భరతనాట్యం శిక్షణ ఇస్తూ ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయ్యింది. దాదాపు 110 సినిమాల్లో కథానాయికగా నటించిన ఈమె మరొక శ్రీదేవి అని పిలుచుకుంటుంటారు ఆమె అభిమానులు.


వంశీ దర్శకత్వంలో వచ్చిన సితార సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈమె ఆ సినిమాతో మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన స్వర్ణకమలం సినిమాతో కళాకారిణిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. సహజంగానే మంచి నాట్య కళాకారిణి అయిన ఈమె దీని తరువాత చాలా కమర్షియల్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సన్ నెట్వర్క్ ఛానల్ లో ప్రసారమైన శక్తి అనే టెలీ ధారావాహికలో కూడా టాప్ హీరోయిన్ గా ఉన్నప్పుడే నటించింది. భానుప్రియ వంశీ కాంబినేషన్ లోని సినిమాలను అత్యధిక మంది ఇష్టపడేవారు.

వారి కాంబినేషన్లో మంచి సినిమాలు రావడమే దీనికి కారణం. తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలందరి సరసన నటించిన ఈమె చిరంజీవితో పాటు డాన్స్ సరిసమానంగా వేసి సమ ఉజ్జీ అనిపించుకుంది. వీరిద్దరిది విజయవంతమైన జోడీగా పిలుచుకునే వారు సినిమా వారు. సినిమాల్లో హీరోయిన్ ఛాన్సులు తగ్గిన తర్వాత ఆమె ప్రత్యేక పాత్రలు చేస్తూ వచ్చింది. ప్రభాస్ హీరోగా నటించిన చత్రపతి సినిమాలో ఆమె పోషించిన పాత్రకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం సీరియల్స్ లో కూడా  చేస్తుంది. సినిమా పట్ల ఇష్టంతో ఇప్పటికీ ఏదైనా అవకాశం వస్తే చేయడానికి సిద్ధంగా ఉంది భాను ప్రియ. 

మరింత సమాచారం తెలుసుకోండి: