తెలుగులో కమెడియన్ గా నిలదొక్కుకోవాలి అంటే ఒక ప్రత్యేకమైన వాయిస్ ఉండాలి. అలా లేకపోతే వాళ్ళు ఎక్కువకాలం ఇక్కడ ఉండలేరు. అలా ప్రత్యేక శైలి ఉన్నవాళ్ళలో కృష్ణ భగవాన్ గారు ఒకరు. ఆయన మాములు డైలాగ్ ని కూడా తన డిఫఫరెంట్ వాయిస్ తో ఒక కొత్త అందంన్ని తీసుకొస్తారు. కృష్ణ భగవాన్ గారు కామెడీ వలనే హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా డైరెక్టర్ వంశీ గారి సినిమాల్లో ఆయన కామెడీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం , సరదాగా కాసేపు ఇలా వంశీ గారి డైరెక్షన్ లో వచ్చిన అన్ని సినిమాల్లో ఆయన కామెడీ నే పెద్ద హైలెట్. అయితే కృష్ణ భగవాన్ గారి దగ్గర నటననే కాకుండా రైటర్ గా కూడా చాలా టాలెంట్ ఉంది.

ఒకప్పుడు విడుదలైన ఏప్రిల్ ఒకటి విడుదల , లేడీస్ టైలర్ సినిమాలకి ఆయన రచనలు అందించారు. ఇక కృష్ణ భగవాన్ గారు హీరోగా నటించిన సినిమాలు మాత్రం ఏవి సరిగ్గా ఆడలేదు. మిస్టర్ గిరీశం , జాన్ అప్పారావు 40 ప్లస్ లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. అయితే గత కొంతకాలంగా కృష్ణ భగవాన్ గారు సినిమాల్లో నటించడం చాలా తగ్గించారు.దానికి కారణాలు ఏమి తెలియకపోయిన ఆయన నటించిన సినిమాలు ఇప్పటికి చూసి నవ్వుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు.

సినిమాలో కాసేపే ఉన్న కూడ ఆయన చేసే మ్యాజిక్ అంత ఇంత కాదు. రవితేజ హీరోగా నటించిన వెంకీ సినిమాలో ఆయన ఉండేది కాసేపు అయినప్పటికీ కృష్ణ భగవాన్ చేసే కామెడీ మనకు సినిమా అయిపోయాక కూడా గుర్తుంటాది. అలాగే దుబాయ్ శ్రీను లో కూడా ఆయన కామెడీ సినిమాకే హైలెట్.కృష్ణ భగవాన్ గారు తెలుగులో దాదాపుగా 350 సినిమాల్లో నటించి ఎంతోమంది అభిమానులని పొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: