అసలే అక్కినేని నాగచైతన్య తో విడాకులు తీసుకుని ఎంతో బాధలో ఉన్న సమంత కు ఇప్పుడు మరో ఎదురు దెబ్బ తగిలింది. టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఏ మాయ చేసావే చిత్రంతో పరిచయమై ఆ తర్వాత పెద్ద పెద్ద హీరోలతో కలిసి నటించి ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అలా ఆమె అక్కినేని నాగ చైతన్య తో మూడు సినిమా లు చేయగా ఆ పరిచయం స్నేహం గా ఏర్పడి ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లగా ఇప్పుడు అది విడాకులకు దారి తీసింది.

గత కొన్ని రోజులుగా వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారు అనే వార్తలు వస్తున్న నేపథ్యం లో అవి నిజమేనని ఇప్పుడు అక్కినేని నాగ చైతన్య సోషల్ మీడియా వేదికగా చెప్పడంతో క్లియర్ అయిపోయింది. వీరిద్దరి విడాకుల తో ఒక్కసారిగా సోషల్ మీడియా దద్దరిల్లిపోతోంది ప్రతి ఒక్కరూ వీరిద్దరి విడాకుల విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. అక్కినేని నాగర్జున కూడా వీరి విడాకుల గురించి స్పందించాడు. తాజాగా సమంత నటించిన సినిమాల పై ఎఫెక్ట్ పడినట్లు కనిపిస్తుంది.

ఆమె నయనతారతో కలిసి విగ్నేష్ దర్శకత్వంలో నటించిన సినిమా కథు వాకుల రెండు కాదల్ అనే సినిమా ఇప్పుడు ఓ టి టి లో విడుదల కాబోతోందని వార్తలు వస్తున్నాయి. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతు ఉండగా ఈ సినిమా ఎనౌన్స్ అయిన దగ్గర్నుంచి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.  తాజాగా డిస్నీ హాట్ స్టార్ లో ఈ సినిమాను విడుదల చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. నవంబర్ 4 నుంచి ఈ సినిమా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుందని తెలుస్తుంది. మరి దీనిలో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన ఇచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: