భారీ సినిమా డేట్స్ అన్నీ ఒకదాని వెంట ఒకటి ప్రకటింపబడుతు ఉండటంతో దీపావళి క్రిస్మస్ సంక్రాంతి సీజన్ లకు సంబంధించిన డేట్స్ అన్నీ ఫుల్ అయిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ‘అఖండ’ ను రిలీజ్ చేయాలి అంటే ఒక్క దీపావళి పండుగ తప్ప మరే సీజన్ కు ఖాళీలు లేవు.
వాస్తవానికి దీపావళికి కూడ మీడియం రేంజ్ సినిమాల హడావిడి మాత్రమే కనిపిస్తోంది. దీనితో దీపావళికి ‘అఖండ’ వస్తే దానికి పోటీగా మరో భారీ సినిమా వచ్చే ఆస్కారం లేదు. అయితే వెంకటేష్ ‘దృశ్యం 2’ మూవీని కూడ దీపావళి పండుగ ముందు విడుదల చేయడానికి ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా దీపావళి అమావాస్య సెంటిమెంట్ గతంలో తెలుగు సినిమా నిర్మాతలకు అంతగా కలిసిరాలేదు.
దీనితో దీపావళి కాకుంటే మరే సీజన్ ఉంటుంది అన్న ఆలోచనలు ‘అఖండ’ టీమ్ చేస్తున్నప్పటికీ వారికి దీపావళి పండగ మినహా మరొక మార్గం కనిపించడంలేదు అంటున్నారు. డిసెంబర్ లో ‘పుష్ప’ హడావిడి జనవరిలో సంక్రాంతి సినిమాల హంగామా ఉన్న పరిస్థితులలో సాధారణంగా ఉండే ఈ అమావాస్య సెంటిమెంట్ ను పక్కకు పెట్టే ఆలోచనలు చేస్తున్నారట.
ఈసినిమాలో విలన్ గా పరిచయం అవుతున్న శ్రీకాంత్ గెటప్ కోసం ఏకంగా 40 మేకోవర్స్ ను ట్రై చేసినట్లు తెలుస్తోంది. ఈమూవీకి శ్రీకాంత్ గెటప్ తో పాటు బాలకృష్ణ వేసుకున్న రకరకాల గెటప్స్ ను చూసి ప్రేక్షకులు షాక్ అవుతారని అంటున్నారు. అయితే ఈమూవీకి భారీ కలక్షన్స్ రావాలి అంటే కనీసం దీపావళికి అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిక్కెట్ల రేట్ల పెంపు విషయంలో ఇండస్ట్రీ వర్గాలు చేస్తున్న అభ్యర్థనలు మన్నించగలిగి ఉండాలి. జరుగుతున్న పరిణామాలు గమనిస్తూ ఉంటే పరిస్థితులు ఆ తీరుగా లేవు. దీనితో ‘అఖండ’ దీపావళికి రావడం సందేహమే అంటున్నారు. అయితే ఈ డేట్ తప్ప మరొక డేట్ ‘అఖండ’ నిర్మాతలకు లేదు. ఈ కన్ఫ్యూజన్ కు త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి