శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా పరిచయం అవుతున్న ‘పెళ్ళిసందడి’ మూవీకి సంబంధించిన పాటలు వరసగా రిలీజ్ అవుతున్నప్పటికీ ఆపాటల ట్యూన్స్ కు పెద్దగా ఆదరణ కనిపించడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్స్ ను చూసినవారు ఈమూవీలోని పాటలు సన్నివేశాల చిత్రీకరణ గతంలో వచ్చిన ‘పెళ్లి సందడి’ ఫ్లేవర్ ను తప్పించుకోలేకపోతోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.


అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి ఫొటోగ్రఫీ కొరియోగ్రఫీలో తప్ప ఎక్కడా కొత్తదనం లేదన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో వచ్చిన ‘పెళ్లిసందడి’ మ్యూజికల్ హిట్ గా నిలిచింది కాబట్టి అదే కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ కీరవాణి చంద్రబోస్ లు ఈ సినిమాకి కూడా కలిసి పనిచేశారు. అయితే ఈ పాటలు సాహిత్య పరంగా కాని సంగీత పరంగా కాని ఏమాత్రం బాగా లేవు అన్న కామెంట్స్ వస్తున్నాయి. పాత ‘పెళ్లి సందడి’ సినిమాలో అబ్బాయి మొహమాట పడటం అమ్మాయి సిగ్గు పడటం లాంటి సన్నివేశాలు రక్తి కట్టడంతో పాటు మరొకవైపు ఆడ పెళ్ళివారి మర్యాదలు ఆటపట్టించడాలు అలకలు బుజ్జగింపులు  సీన్స్ ను మళ్ళీ ఈకొత్త ‘పెళ్ళిసందడి’ లో కూడ రిపీట్ చేసినట్లు తెలుస్తోంది.


అయితే ఇప్పటి పరిస్థితి వేరు ప్రేమకి పెళ్లికి అర్థాలు మారిపోతున్నాయి. ఈ జనరేషన్ ప్రేమను కొత్త కోణంలో చూస్తోంది. అలాంటి పరిస్థితులలో మళ్ళీ పాత పెళ్ళిసందడి సీన్స్ ను రిపీట్ చేస్తే ఈ కొత్త ‘పెళ్ళిసందడి’ లో ఎంతవరకు చూస్తారు అన్నది సందేహం. ప్రస్తుతం యూత్ ఏమి చేయాలన్నా ఏమి చెప్పాలి అనుకున్నా స్మార్ట్ ఫోన్ సహాయంతో చేస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ ట్రెండ్ లో మళ్ళీ పాత ‘పెళ్ళిసందడి’ సీన్స్ కనిపిస్తే యూత్ బోర్ ఫీల్ అవుతారు అన్న సంకేతాలు వస్తున్నాయి. మరి దీనికి భిన్నంగా తన టైటిల్ లో కొద్దిగా మార్పు చేసుకుని ‘పెళ్లిసందD’ గా వస్తున్న ఈమూవీ ఎంతవరకు యూత్ కు కనెక్ట్ అవుతుందో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: