రాధేశ్యామ్ మరియు సలార్, ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నాడని అందరికి తెలిసిన విషయమే. ఇక బాహుబలి సిరీస్‌తో తెలుగు ఖ్యాతిని దశదిశలా చాటి చెప్పిన ఈ హీరో ఒక్క సినిమాకు 100 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయని తెలుస్తుంది.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం యంగ్ రెబల్ స్టార్ ఆదిపురుష్ సినిమా కోసం కళ్ళు చెదిరే పారితోషకం పుచ్చుకుంటున్నాడని తెలుస్తుంది.ఇకా ఆ అమౌంట్ చూసి బడా నిర్మాతలు సైతం తెలిసి ఖంగుతింటున్నారని సమాచారం. మరికొందరు మాత్రం ప్రభాస్ ఉన్న క్రేజ్ కి ఆ మాత్రం తీసుకోక పోతే ఎలా అంటున్నారని తెలుస్తుంది. ఇంతకి ఆదిపురుష్ సినిమా కోసం ప్రభాస్ ఎన్ని కోట్లు తీసుకుంటున్నారో తెలుసా ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కోసం అక్షరాల 150 కోట్లు అందుకున్నాడని సమాచారం. టాలీవుడ్‌లో ఇంత పెద్ద మొత్తం అందుకుంది ప్రభాస్ ఒక్కడేనని అలాగే దక్షిణాదిలో కూడా ఇంత రెమ్యునరేషన్ అందుకున్నవాళ్లెవరూ లేరని ఆయన అభిమానులు అంటున్నట్లు సమాచారం.
బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ తెరకెక్కిస్తున్న 'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ రాముడిగా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. కృతి సనన్ సీతగా నటిస్తున్నరని సమాచారం. లంకేశ్‌గా సైఫ్ అలీఖాన్ మరియు లక్ష్మణ పాత్రలో సన్నీ సింగ్ కనిపించబోతున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.అయితే ఈ మూవీకి 50 రోజులు డేట్స్ ఇచ్చాడాట డార్లింగ్. ఈయన రోజుకు సుమారు రూ.3 కోట్లు చొప్పున 50 రోజులకి రూ.150 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోందని సమాచారం. ఇక ఇదే కనుక నిజమైతే ఇప్పటివరకు ప్రపంచంలోనే ఏ స్టార్ హీరో అందుకోనటువంటి భారీ రెమ్యునరేషన్ ప్రభాస్ అందుకుంటున్నట్లేనని తెలుస్తుంది
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి