అక్కినేని నాగ చైతన్య, సమంత ఇటీవల అధికారికంగా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఏ మాయ చేసావే సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన సమంత ఆ సినిమాతో సూపర్ హిట్ ని అలానే ఆడియన్స్ లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ని దక్కించుకుంది. ఆ తరువాత నుండి హీరోయిన్ గా ఎంతో మంచి పేరు తో పాటు వరుసగా అవకాశాలు అందుకుంటూ కొనసాగిన సమంత, ఆపైన కొన్నేళ్ల అనంతరం ఇటీవల నాగ చైతన్యని ప్రేమించి మరీ ఇద్దరు కుటుంబాలని ఒప్పించి వివాహం చేసుకున్నారు.

వాస్తవానికి నాలుగేళ్లుగా ఎటువంటి అరమరికలు లేకుండా వీరిద్దరి కాపురం సాగిపోతోంది. అయితే మధ్యలో ఏమి జరిగిందో ఏమో తెలియదుగాని వీరు విడిపోవాలని అనుకుంటున్నారని, కొన్ని అనుకోని కారణాల వలన వీరిద్దరి కాపురంలో కొన్ని మనస్పర్థలు వచ్చాయని ఇటీవల పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే అది నిజం కాదని అందరూ అనుకున్నారు. అయితే అందరికీ భారీ షాక్ ఇస్తూ తాము నిజంగానే విడిపోతున్నట్లు చైతన్య, సమంత ప్రకటిచడంతో ప్రేక్షకాభిమానులు ఒక్కసారిగా దిగ్బ్రాంతికి లోనయ్యారు.

కాగా ఆ తరువాత నుండి వారిద్దరి విడాకులకు కారణాలు ఇవే అంటూ పలువురు ఎవరికి తోచిన విధంగా వారు యూట్యూబ్ లో అలానే మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రచారం చేస్తున్నారు. అవన్నీ ప్రక్కన పెడితే సమంత నుండి విడిపోయిన తరువాత తనకంటూ ప్రత్యేకమైన ఇల్లు కొనుగోలు చేసిన నాగ చైతన్య త్వరలో తన సామానులతో సహా అందులోకి షిఫ్ట్ అవుతున్నారట. బంజారాహిల్స్ లో కొన్ని కోట్ల రూపాయలతో అధునాతన సౌకర్యాలతో ఈ భవనం నిర్మితం అయిందని సమాచారం. కాగా విడాకుల తరువాత కూడా తల్లితండ్రులతో ఉండడం సరైనది కాదని, తనకు ప్రస్తుతం ప్రైవసీ కావాలని భావించిన చైతన్య ప్రత్యేకంగా ఈ ఇంటిని కొనుగోలు చేసినట్లు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: