ఇక ఫైనల్ గా మొన్న ఆదివారం ఎన్నికలు జరిగి ఫలితాలు రావడం, అలానే ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై విష్ణు భారీ స్థాయిలో మెజారిటీ తో గెలుపొంది అధ్యక్షుడి హోదా ని అందుకొవడం జరిగింది. ఇక విషయం ఏమిటంటే ఆ తరువాత మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ప్రకాష్ రాజ్, నేడు ఒక్కసారిగా ప్రత్యేక మీడియా సమావేశం పెట్టడం అలానే ఎన్నికల్లో గెలిచిన ఆయన ప్యానల్ సభ్యులు పలువురు మూకుమ్మడిగా రాజీనామా చేయడం జరిగింది.
అయితే తాము ఈ రాజీనామా నిర్ణయం తీసుకుంది మాలో మరింత పారదర్శకమైన పాలన సాగడం కోసమే అని, ఈ విధంగా సగం మంది విష్ణు ప్యానల్ సభ్యులు, మరి సగం మంది తమ ప్రకాష్ రాజ్ గారి ప్యానల్ సభ్యులు ఉంటె కొంత అభిప్రాయబేధాలు వచ్చే ఛాన్స్ ఉందని, అందుకే తాము రాజీనామాలు చేయగా విష్ణు గారి ప్యానల్ సభ్యులు అందరిని కూడా మీ అందరూ గెలిపించి వారికే పగ్గాలు ఇస్తే రాబోయే రోజుల్లో మా మరింతగా అభివృద్ధి చెందే ఛాన్స్ ఉందని ఉత్తేజ్ నేడు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అయితే ఇక్కడ తమకు ఎవరిపైన కూడా ప్రత్యేకంగా ద్వేషం కానీ, కోపం కానీ లేదని, కాకపోతే అందరికీ సమ న్యాయం జరగాలి అనే ఉద్దేశ్యంతోనే తాము ఈ విధంగా చేసినట్లు ఉత్తేజ్ తో పాటు ప్రకాష్ రాజ్ ప్యానల్ లోని ఇతర సభ్యులు అందరూ కూడా చెప్పారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి