తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతోమంది దర్శకులు మొదటి సినిమాతో బాక్సాఫీసు వద్ద అదిరిపోయే బ్లాక్ బాస్టర్ ని చూసి ఆ తర్వాత తమ రెండవ సినిమాలతో మాత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపని వారు చాలా మంది ఉన్నారు. కానీ కొంత మంది దర్శకులు మాత్రం మొదటి సినిమాతో ఏ రేంజ్ ఇంపాక్ట్ ను బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేసారో, అదే రేంజ్ లో తమ రెండో సినిమాతో కూడా మ్యాజిక్ చేసిన వారు ఉన్నారు. ఇలా మొదటి సినిమాతో బాక్సాఫీసు వద్ద అదిరిపోయే హిట్ అందుకొని రెండవ సినిమా రిజల్ట్ కోసం వేచి చూస్తున్న టాలీవుడ్  దర్శకులలో అజయ్ భూపతి ఒకరు. దర్శకుడు అజయ్ భూపతి కార్తికేయ హీరో గా పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 సినిమా తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా ప్రారంభం అయినప్పుడు జనాలలో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు అనే చెప్పవచ్చు, కానీ ఆ తర్వాత ఈ దర్శకుడు ఆర్ ఎక్స్ 100 సినిమా నుండి విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటల ద్వారా ఈ సినిమాపై జనాల్లో మంచి హైప్ క్రియేట్ అయ్యింది.

 సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ సినిమా అటు ప్రేక్షకుల నుండి ఇటు విమర్శకుల నుండి ప్రశంసలు పొంది బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ సినిమా తో దర్శకుడు అజయ్ భూపతి  కి కూడా దర్శకుడిగా మంచి పేరు దక్కింది. ఇలా ఆర్ఎక్స్ 100 సినిమా తో ఎంతో మంది విమర్శకుల ప్రశంసలు పొందిన అజయ్ భూపతి ప్రస్తుతం శర్వానంద్, సిద్ధార్థ హీరోలుగా అదితి రావు హైదరీ, అను ఇమాన్యుయల్ హీరోయిన్లుగా మహా సముద్రం సినిమాను తెరకెక్కించాడు. అజయ్ భూపతి కి దర్శకుడిగా ఇది రెండవ సినిమా. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు జనాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమాపై జనాలు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి దర్శకుడు అజయ్ భూపతి ఆర్ఎక్స్100 సినిమా తో బాక్స్ ఆఫీసు వద్ద చేసిన మ్యాజిక్ ను మరోసారి మహా సముద్రం సినిమా తో క్రియేట్ చేస్తాడో, లేదో తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: