టాలీవూడ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ ఉన్నారు. రెండు మూడు సినిమాల తరువాత గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ ఉన్నారు. ఆలా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ ఒక్కసారిగా వారి రెమ్యునరేషన్ ని పెంచుతూ ఉంటారు. అలాగే మహానటి సావిత్రి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ కూడా ఓ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ పెంచేసింది. అయితే ఆ సినిమా ఏంటో ఎంత డిమాండ్ చేసిందో ఒక్కసారి చూద్దామా.

నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలదర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా  వస్తున్నా సినిమా దసరా. ఈ సినిమాను తెలంగాణా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన కాన్సెప్ట్ టీజర్ దసరా సందర్భంగా  విడుదల చేసిన సంగతి తెల్సిందే. అయితే నాని సినీ కెరియర్ లో మొదటిసారి తెలంగాణా యాసలో మాట్లాడుతూ నటిస్తున్న ఈ దసరా సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు.  నాని, కీర్తి సురేష్ కలిసి గతంలో నేను లోకల్ సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ జంటకు కూడా మంచి గుర్తింపు వచ్చింది.

మరోసారి ఈ సూపర్ హిట్ జోడీ కలిసి దసరా సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కీర్తి సురేష్ కు కూడా భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో నటిస్తున్నందుకు గాను కీర్తి సురేష్ కు ఏకంగా 3 కోట్ల దాకా పారితోషికం ఇస్తున్నట్లు సమాచారం. కీర్తి సురేష్ ఇప్పటివరకు తెలుగులో 2 కోట్లు కూడా తీసుకోని ఆమె దసరా సినిమాకు మాత్రం 3 కోట్లు డిమాండ్ చేశారంట. ఈ సినిమాలో ఆమె పాత్ర కూడా చాలా ముఖ్యపాత్ర అని సమాచారం. ఇక మొత్తానికి సౌత్ లో 3 కోట్ల హీరోయిన్ లిస్ట్ లో కీర్తి సురేష్ కూడా చేరిందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: