ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాయ్ ఈటీవీ లో ప్రసారమయ్యే పలు కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలలో సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ ప్రోగ్రామ్ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి బుల్లితెర ప్రేక్షకులకు వినూత్నమైన  ఎంటర్టైన్మెంట్ అందిస్తూ దూసుకు పోతుంది. ఈ కార్యక్రమంలో ఇక ప్రతీ వారం కూడా నలుగురు స్పెషల్ గెస్టులు వస్తూ ఉంటారు. ఇక వారితో యాంకర్ సుమ సందడి సందడి చేస్తూ ఉంటుంది.  ఈ కార్యక్రమానికి వచ్చిన నలుగురు గెస్ట్ లను కూడా ఆసక్తికర ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది యాంకర్ సుమ. ఇక వాళ్లు చెప్పిన సమాధానాలు పై అదిరిపోయే పంచులు వేస్తూ ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉంటుంది.  ఇక ప్రతి వారం కూడా ఇలా ఈ కార్యక్రమం ఎంతో సందడి సందడి గా సాగుతూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ఇక ఇటీవలే వచ్చే వారం ఎపిసోడ్ కి సంబంధించి క్యాష్ ప్రోమో సోషల్ మీడియా లో విడుదలైంది. ఈ ప్రోమో కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.  ఇక ఈ సారి క్యాష్ షో లోకి షకీల, జ్యోతి, సంపూర్ణేష్ బాబు, అభినయశ్రీ స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. వీరితో కొన్ని ఆసక్తికర టాస్క్ లు ఆడించింది యాంకర్ సుమ.  సాధారణంగా గెస్టులు షో లోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో ఒక పాట పై డాన్స్ చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే షకీలా ఎంట్రీ ఇచ్చిన సమయంలో డాన్స్ చేయాలి అంటూ కోరుతుంది సుమ.  నేను చేయను అంటూ చెప్పేస్తుంది షకీలా. అది ఏంటి మేడం అలా అంటారు నాకోసం ఒక స్టెప్ వేయండి అంటూ అడుగుతుంది షకీలా.. చేయను  అని చెప్పాను కదా ఇక్కడికి రమ్మన్నారు వచ్చాను డాన్స్ వేయడం ఏంటి అంటూ చెబుతుంది. ఇక ఆ తర్వాత నేను వెయ్యను గాని నా కొడుకుతో వేయించండి అంటూ చెబుతుంది షకీలా.  మీ కొడుకా ఎక్కడ ఉన్నాడు అంటూ సుమ అడగగా ఒకసారి పిలువు వస్తాడు అంటూ చెబుతోంది. ఇక సుమ పిలవగానే లోపల్నుంచి సంపూర్ణేష్ బాబు వస్తాడు ఇక రావడం రావడమే షకీలా కాళ్ళకి దండం పెడతాడు సంపూర్ణేష్ బాబు. దీంతో అక్కడున్న వారందరూ షాక్ అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: