నందమూరి వంశం పెద్ద వారసుడిగా పేరున్న కళ్యాణ్ రామ్ కి తన కెరీర్ పరంగా ఒక్క హిట్టు కూడా లేదు. నిర్మాతగా సక్సెస్ అయినా కళ్యాణ్ రామ్ హీరోగా నిలదొక్కుకోలేకపోతున్నాడు. ఇక ఈసారి హీరోగా మంచి హిట్టు కొట్టి నిరూపించుకోవాలనుకుంటున్నాడు.ఇక నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా 'బింబిసార' అనే చారిత్రాత్మక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఇక మొన్నామధ్య విడుదలైన ఫస్ట్ లుక్ కూడా ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యేలా చేసింది.ఇక ఈ సినిమా దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్ తో స్వయంగా హీరో కళ్యాణ్ రామే నిర్మిస్తున్నాడు. అతని కెరీర్లో ఈ సినిమానే హైయెస్ట్ బడ్జెట్ చిత్రం. ఇంత బడ్జెట్ అంటే చాలా రిస్క్ అనే చెప్పాలి. కానీ కళ్యాణ్ రామ్ కు ఇలాంటి రిస్క్ లు చేయడం అసలు కొత్తేమి కాదు.గతంలో కూడా 'హరేరామ్' 'ఓం 3D' 'ఇజం' వంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించి బాగా చేతులు కాల్చుకున్న అనుభవం కూడా నందమూరి కళ్యాణ్ రామ్ కు ఉంది. ఇక కథ కనుక అతనికి నచ్చితే కళ్యాణ్ రామ్.. ఆ ప్రాజెక్టుని అస్సలు వదులుకోడు.

ఇక ఇదిలా ఉండగా.. ఈ మధ్య కాలంలో కళ్యాణ్ రామ్ ఎక్కువగా తమ్ముడు ఎన్టీఆర్ సలహాలే బాగా తీసుకుంటూ వచ్చాడు. ఇక ఈ క్రమంలో నిర్మాణ రంగానికి కొంచెం దూరంగా ఉండమని ఎన్టీఆర్.. కళ్యాణ్ రామ్ కు సూచించినట్టు కూడా వార్తలు వినిపించడం జరిగింది. అయితే ఈసారి ఎన్టీఆర్ ను కాదని కళ్యాణ్ రామ్ 'బింబిసార' సినిమాని నిర్మిస్తున్నాడు.ఇక పైగా ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయిన వెంటనే ఎన్టీఆర్ ను కాదని బాలయ్యకి ఈ సినిమాని చూపించాలని కళ్యాణ్ రామ్ భావిస్తున్నాడట.కాని ఎన్టీఆర్ ను పక్కన పెట్టాలి అనేది కళ్యాణ్ రామ్ ఉద్దేశం కాదట.నిజం చెప్పాలంటే బాలయ్య బాబు ఎన్నో పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాలు చేసి హిట్లు అందుకున్నాడు.అందుకే ఆయన అనుభవం వాడుకుని… ఏమైనా మార్పులు చెబితే చేయాలనేది కళ్యాణ్ రామ్ ప్రధాన ఉద్దేశం అట. ఇక నిజానికి 'బింబిసార' స్క్రిప్ట్ విషయంలో కూడా బాల కృష్ణ పలు మార్పులు చెప్పడం.. ఇక వాటిని దర్శకుడు మల్లిడి వశిష్ట్ కూడా ఆచరించడం జరిగాయి అనేది ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: