కొంత మంది సెలబ్రిటీలు చిన్నవయసులోనే చనిపోవడం జరిగింది. వారు చనిపోవడానికి కారణం ఏదైనా కూడా చేసిన తక్కువ సినిమాలతోనే భారీ క్రేజ్ అందుకని మంచి అభిమానాన్ని అందుకొని అకస్మాత్తుగా చనిపోవడం వారి అభిమానులను ఎంతగానో నిరాశపరిచింది. వారిని నిరాశపరిచిన సంగతి అటుంచితే అలా సడెన్ గా చనిపోవడం వారికి ఎంతో బాధాకరం అనిపించింది. చక్కని నటన మంచి వ్యక్తిత్వం కలవారు ఇంత త్వరగా చనిపోవడం వారు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.
అలా చిన్న వయసులోనే చనిపోయిన వారి జాబితాలో
హీరోయిన్ దివ్యభారతి ఉంది. ఆమె కేవలం 21 సంవత్సరాల వయసులోనే చనిపోయింది అంటే ఆమె అంత చిన్న వయసులో చనిపోవడానికి గల కారణం ఏదో పెద్దగా ఉంటుంది అని అందరూ అనుకుంటారు. కానీ ఆమె చనిపోవడానికి గల కారణం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఆమె తన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుని అతి తక్కువ కాలంలోనే స్టార్
హీరోయిన్ గా ఎదిగింది.
టాలీవుడ్ లో ఆమె సినిమాలు చేసిన కొన్ని రోజులకే
బాలీవుడ్ నుంచి అవకాశాలు రావడం మొదలయ్యాయి.
అక్కడ కూడా మంచి మంచి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించే విధంగా దూసుకు పోతూ ఉండగా అనూహ్యంగా ఆమె చిన్న వయసులోనే
పెళ్లి చేసుకోవడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.
పెళ్లి చేసుకోవడం అనే విషయం అటుంచితే
పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సినిమాల్లో కొనసాగలేదు. అంత చిన్న వయసులో అంత పెద్ద పాపులారిటీ అందుకున్న ఆమె పాపులారిటీ ఇచ్చిన సినిమాలకు దూరం కావడంతో ప్రేక్షకులు ఎంతగానో నిరాశపడ్డారు. ఆ తరువాత ఆమె చనిపోవడం వారికి ఎంతో బాధాకరంగా అనిపించింది. ఏదేమైనా అతి చిన్న వయసులో దివ్యభారతి చనిపోవడంతో
ఇండియన్ సినిమా పరిశ్రమ ఓ గొప్ప నటి కోల్పోయిందని చెప్పాలి. తెలుగులో ఆమె
బొబ్బిలి రాజ
సినిమా ద్వారా బాగా పాపులర్ అయ్యింది.