సినిమా రంగం అనేది ఒక అందాల రంగుల హరివిల్లు. ఇక్కడ ఉండే వారు అందరూ పైకి నవ్వుతూ బాగానే ఉన్నా మనసులో ఎన్నో కష్ట నష్టాలు సమస్యలు ఉంటాయి. వారికి వారే ఎవరితో అయినా చెప్పుకుంటే తప్పితే అవి బయటకు రావు. అలాంటి ఒక సినీ నటికి సంబంధించిన వార్త వైరల్ అవుతోంది. టాలీవుడ్ లో ఒక బాలనటిగా వచ్చి స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన రాశి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. తన సినిమా జీవితంలో స్టార్ హీరోల సరసన నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. నటనకు స్కోప్ ఉంటే ఎలాంటి పాత్రనైనా చేయగలను అని రాశి నిరూపించుకున్నారు. ఆ విధంగానే నిజం సినిమాలో గోపీచంద్ దగ్గర నుండి ఒక విభిన్నమైన పాత్రని పోషించి శభాష్ అనిపించుకుంది.

అలా అడపా దడపా కొన్ని సహాయక పాతరాలు చేసినా మంచి పాత్రలు రావడం బాగా తగ్గిపోయాయి. ఇండస్ట్రీలో తమకున్న ఫేమ్ పోతే మరియు ఎవ్వరికైనా ప్రేక్షకుల్లో క్రేజ్ తగ్గిపోతే అవకాశాలు ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రారు. ఇక్కడ రాశి విషయంలో అదే జరిగింది. అవకాశాలు సన్నగిల్లడంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని తెలుస్తోంది. సినిమా నటులు అన్నాక ఒక స్థాయిలో జీవితాన్ని గడిపి ఇప్పుడు సడెన్ గా లైఫ్ అంతా రివర్స్ అయిపోతే తట్టుకోలేరు. ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించాలి మళ్లీ ఎప్పటి లాగే జీవించాలి అనుకుంటారు. అదే విధంగా రాశి కూడా అందుకే ఈ ఆర్థిక పరమైన కష్టాలను దాటడానికి సీరియల్స్ లోకి అడిగి పెట్టింది.

ప్రస్తుతం ఈమె మా టీవిలో ప్రసారం అవుతున్న "జానకి కలగనలేదు" అనే సీరియల్ లో జ్ఞానాంబ పాత్రను చేస్తోంది. ఇందులో ఒక మంచి అమ్మగా బాధ్యతల ఇంటి పెద్దగా తెలుగింటి మన్ననలు అందుకుంటోంది. ఈ పాత్రకు మరియు సీరియల్ కు ప్రేక్షకుల్లో మంచి స్పందన వస్తోంది. ఈ సీరియల్ ద్వారా మళ్లీ రాశి సినిమాలలో రాణిస్తుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: