సాధారణంగా సినీ సెలబ్రిటీలు పర్సనల్ విషయాలను కాస్త సీక్రెట్ గా ఉంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  ఎవరితో అయినా ప్రేమలో కొనసాగుతూ ఉంటే ఆ ప్రేమ విషయం బయటకు రాకుండా ఎంతో జాగ్రత్త పడుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఎంతో మంది యువ హీరోలు తమ ప్రేమ విషయాన్ని బయటకు చెప్పుకోవడానికి అభిమానులతో పంచుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ప్రేమ విషయం మాత్రమే కాదు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి కూడా ముందుగానే అభిమానులకు చెప్పేస్తున్నారు హీరోలు. ఇలాంటి హీరోలలో కార్తికేయ కూడా చేరిపోయాడు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు పొందిన యువ హీరోగా కొనసాగుతున్నాడు కార్తికేయ.


 అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు. డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులందరికీ కనెక్ట్ అయిపోయింది అని చెప్పాలి. ఈ సినిమాలో కాస్త బోల్డ్ గా నటించిన కార్తికేయ తన నటనతో ఆకట్టుకున్నాడు  మొదటి సినిమా అయినప్పటికీ ఎలాంటి భయం బెరుకు లేకుండా నటించాడు. ఇక ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాడు కార్తికేయ. అదే సమయంలో విలన్ గా కూడా అవకాశాలు అందుకుంటూ తన విలనిజంతో కూడా ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్నాడు.


 ఇక ప్రస్తుతం మంచి గుర్తింపు ఉన్న యువ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు కార్తికేయ. కాగా ప్రస్తుతం రాజావిక్రమార్క అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక పై ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇక ఈ కార్యక్రమంలో తన గర్ల్ ఫ్రెండ్ కాబోయే భార్య లోహిత ను కార్తికేయ అందరికీ పరిచయం చేశాడు. అంతేకాదు స్టేజ్ మీద ప్రపోజ్ చేశాడు. నా లైఫ్ లో హీరో అవ్వడానికి పెట్టినంత స్ట్రగుల్ నీ ప్రేమను పొందడానికి పెట్టాను అంటూ ప్రపోజ్ చేసిన కార్తికేయ.. నవంబర్ 21వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నాను తన పేరు లోహిత అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: