మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కి జంటగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటి స్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు, ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జంటగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా ను ఫిబ్రవరి 4 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో కూడా హీరోగా నడుపుతున్నాడు. ఈ రెండు సినిమా షూటింగ్ లను చక చకా పూర్తి చేస్తున్న చిరంజీవి వీటితో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమాలు కూడా మరి కొన్ని రోజుల్లో ప్రారంభించబోతున్నారు.

 ఆ వెంటనే బాబీ దర్శకత్వంలో చిరంజీవి 154 వ సినిమా  రెగ్యులర్ షూటింగ్ ను కూడా ప్రారంభించబోతున్నారు.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఇలా వరుస సినిమా షూటింగ్ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న మెగాస్టార్ చిరంజీవి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో కూడా ఒక సినిమాను కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా అనేక వార్తలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త నిజం అయినట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: