ఇంట్రెస్ట్  లోకి ఎంట్రీ ఇచ్చే దర్శకులు తాము దర్శకత్వం వహించే మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని అందుకోవాలని అని అనుకుంటూ ఉంటారు, కానీ మొదటి సినిమా కావడం వల్ల అవగాహన లోపం కారణంగా లేకపోతే మరి కొన్ని కారణాల వల్ల కొంత మంది దర్శకులు దర్శకత్వం వహించిన మొదటి సినిమాలు అంతగా విజయవంతం కావు.  కానీ కొంత మంది దర్శకులు మాత్రం తాము దర్శకత్వం వహించిన మొదటి సినిమానే అనుకున్న రేంజ్ లో  తెరకెక్కించి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. అలా దర్శకత్వం వహించిన మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని అందుకున్న దర్శకులలో వెంకీ కుడుముల ఒకరు.
వెంకీ కుడుముల, నాగ శౌర్య హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కిన ఛలో  సినిమా తో దర్శకుడి గా ఎంట్రీ ఇచ్చాడు.


ఈ సినిమాను ఈ దర్శకుడు కామెడీ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దాడు. కామెడీ ప్రధాన అంశంగా తెరకెక్కిన చలో సినిమా థియేటర్ లలో జనాలను అలరించి మంచి విజయవంతమైన సినిమాగా నిలిచింది. ఈ సినిమా దర్శకుడు వెంకీ కుడుముల కు తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు తీసుకువచ్చింది. అలాగే ఈ సినిమాలో హీరోగా నటించిన నాగ శౌర్య కు కూడా ఇది అదిరిపోయే విజయాన్ని ఇచ్చింది. అలాగే టాలీవుడ్ లోకి రష్మిక మందన ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది, ఇలా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా తోనే రష్మిక మందన టాలీవుడ్ లో అదిరిపోయే విజయాన్ని అందుకుంది. వెంకీ కుడుములసినిమా తర్వాత నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ భీష్మ సినిమా ను తెరకెక్కించాడు, కామెడీ ప్రధాన నేపథ్యం గా తెరకెక్కిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇలా వెంకీ కుడుముల తెరకెక్కించిన రెండు సినిమాలు కూడా మంచి విషయాలను అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: