నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా అఖండ, ఈ సినిమా లో ముద్దు గుమ్మలు ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్ లుగా నటించగా, శ్రీకాంత్ విలన్ పాత్ర లో కనిపించబోతున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా లో బాలకృష్ణ రైతు గా, అఘోరా గా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు, ఇప్పటికే ఈ సినిమా కు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను, టీజర్ లను, ట్రైలర్ ను, సాంగ్ లను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి  అదిరి పోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమా పై ఉన్న అంచనాలను  కూడా మరింత గా పెంచాయి, ఇప్పటికే ఈ సినిమా కు సంబంధించిన పనులన్నీ పూర్తి కావడం తో ఈ సినిమా ను డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లో విడుదల చేయబోతున్నారు, అయితే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడం తో చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ పెంచింది.

అందులో భాగంగా నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ను హైదరాబాద్ లో చిత్ర బృందం గ్రాండ్ గా నిర్వహించారు. ఫంక్షన్ కు అల్లు అర్జున్, రాజమౌళి ముఖ్య అతిథు లుగా విచ్చేశారు, ఈ ఫంక్షన్ లో భాగంగా రాజమౌళి మాట్లాడుతూ..  బాలకృష్ణ ఒక ఆటంబాంబు, ఆ ఆటంబాంబు ను ఎలా ప్రయోగించా లో శ్రీను గారికి కరెక్ట్ గా తెలుసు.. మీరు ఆ సీక్రెట్ అందరికీ చెప్పాలి, మీ దగ్గరే దాచేసుకుంటే కుదరదు అంటూ సరదాగా చెప్పాడు. అలాగే బాలకృష్ణ గారిని మీ ఎనర్జీ సీక్రెట్ ఏంటో కూడా చెప్పాలి అంటూ రాజమౌళి ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో భాగంగా మాట్లాడాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: