నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తెలుగు ప్రముఖ ఓటిటి ఆహా లో ప్రసారం అవుతున్న ఆన్ స్థాపబుల్ అనే టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, ఇప్పటికే రెండు ఎపిసోడ్ లను పూర్తి చేసుకున్న ఈ టాక్ షో,  మొదటి ఎపిసోడ్ లో భాగంగా మంచు మోహన్ బాబు, విష్ణు , లక్ష్మీ ముఖ్య అతిథు లుగా విచ్చేశారు, వీరి తో సరదాగా ముచ్చటించిన బాలకృష్ణ , అనేక ఆటలను కూడా ఆడించాడు. ఇలా ఎంతో సరదాగా మొదటి ఎపిసోడ్ తో నవ్వులు పూయించిన బాలకృష్ణ  ఆన్ స్థాపబుల్ టాక్  షో కు రెండవ గెస్టు గా నాచురల్ స్టార్ నాని వచ్చాడు, నాచురల్ స్టార్ నాని తో కూడా ఫుల్ సరదాగా జోష్ ఫుల్ గా షో ను బాలకృష్ణ నడిపించాడు. అయితే ఇలా రెండు ఎపిసోడ్ లను ఫుల్ జోష్ ఫుల్ లో నటించిన బాలకృష్ణ ఆ తర్వాత ఎపిసోడ్ కు చేతి గాయం వల్ల దూరం అయ్యాడు.

అయితే ప్రస్తుతం బాలకృష్ణ టాక్ షో కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది, ఆ వార్త ప్రకారం బాలకృష్ణ ఆన్ స్థాపబుల్ టాక్ షో కు బ్రహ్మానందం మూడవ గెస్ట్ గా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి, బాలకృష్ణ కు, బ్రహ్మానందం కు ఉన్న సాన్నిహిత్యం వల్ల ఆన్ స్థాపబుల్ టాక్ షో కు బ్రహ్మానందం రావడానికి ఒప్పుకున్నట్లు గా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యే బ్రహ్మానందం ఈటీవీ లో ప్రసారం అవుతున్న ఆలీతో సరదాగా అనే పోగ్రామ్ కు గిఫ్ట్ గా వచ్చాడు, అయితే ప్రస్తుతం ఆహా నిర్వాహక బృందం కూడా బ్రహ్మానందం ని ఆన్ స్థాపబుల్ టాక్ షో కు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: