చిత్ర పరిశ్రమలో ఆయన సీనియర్ నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ఇండస్ట్రీలో ఎస్వీ రంగారావు తర్వాత అంతటి స్థాయిలో నటించి నటుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఇక ఇండస్ట్రీలో నటుడు రంగనాథ్ సుమారు 300కు పైగా చిత్రాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. నటుడు రంగనాథ్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన ఏఎన్ఆర్, ఎన్టీఆర్ సినిమాల నుంచి నేటి యువ హీరోల సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

నటుడు రంగనాథ్ కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా పలు సీరియల్స్‌లో నటించి బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. చిత్ర పరిశ్రమలో ఎన్నో చిత్రాలలో నటించి విశేషమైన గుర్తింపు సంపాదించుకున్న రంగనాథ్ చివరికి ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంగతి తెల్సిందే. అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణం ఈయన పట్టింపులే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే రంగనాథ్ నటనపై ఆసక్తి ఉండటం వల్ల ఏ చిన్న పొరపాటు జరిగినా వదిలేసే వాడు కాదంట. ఆయనకి ఎంతో మంది దర్శకులకు సలహా ఇస్తూ వారితో వివాదాలు పెట్టుకుంటూ ఉండేవాడంట. చిత్ర పరిశ్రమలో రంగనాథ్ చాలా మంది దర్శకులతో గొడవ పడ్డారు. ఇక ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నటువంటి రాజమౌళి తన కెరియర్ మొదట్లో శాంతి నివాసం అనే సీరియల్‌కి డైరెక్టర్‌గా రాణించారు.

ఈ ధారావాహిక చిత్రీకరిస్తున్న సమయంలో కూడా ఇతనికి రాజమౌళికి మధ్య గొడవ జరగడంతో ఈ సీరియల్ నిర్మాత కె.రాఘవేంద్రరావు మరికొందరు కలిసి ఆయనను ఇండస్ట్రీలో బ్యాన్ చేశారంట. అయితే అప్పటికే ఆయన అనారోగ్యంతో మంచం పట్టడం వల్ల ఏదో ఖర్చుల కోసం సినిమాలలో నటిస్తున్న రంగనాథ్‌కు సినిమా అవకాశాలు కూడా తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. కాగా అతడిని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడం.. అదే సమయంలో తన భార్య మరణించడంతో ఆయన మనస్తాపం చెందారు. ఇక చివరికి ఆయన ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: