'ఆర్‌.ఆర్‌.ఆర్' ట్రైలర్‌ ప్రస్తుతం సోషల్ మీడియాని ఎలేస్తోందని తెలుస్తోంది.మరి ట్రైలర్ ఎలా ఉంది ? అని అగడటం అనవసరమని చెప్పొచ్చు.

కాకపోతే, ట్రైలర్ లో ఏమి ఉన్నాయో ? ఎలాంటి అంశాలను హైలైట్ చేశారో ఇప్పుడు చూద్దాం. ఎప్పటిలాగే రాజమౌళి ప్రతీ సీన్ ను బాగా ఎలివేట్ చేశాడట.అలాగే ప్రతి షాట్ ను బాగా చూపించాడట.. ఇక ఎలివేషన్స్, హీరోయిజాలు విషయానికి వస్తే.. ప్రతి ఎక్స్ ప్రెషన్ ఓ క్లైమాక్స్ లానే ఉందని తెలుస్తుంది.

పాన్ ఇండియా సినిమా అంటే ఎలా ఉండాలో ఏ స్థాయిలో ఉండాలో చాటి చెప్పిన సినిమా 'ఆర్.ఆర్‌.ఆర్‌' అని తెలుస్తుంది.. ఒక సినిమా కోసం అసలు దేశం మొత్తం ఆసక్తితో ఎదురు చూస్తుందా అనే ప్రశ్నకు జవాబు కోసం జనవరి 7 కోసం భారతీయ సినీ జగత్తు మొత్తం ఎదురుచూస్తోందని తెలుస్తుంది.ట్రైలర్ లో డైలాగులు మరియు ఎమోషన్స్‌, విజువలైజేషన్స్ చూశాకా, సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఆత్రుత పెరిగిందట..

మొత్తం 3 నిమిషాల 15 సెకన్ల ట్రైలర్‌ లో స్థూలంగా కథను అయితే రాజమౌళి వివరించాడట.భీమ్.. బ్రీటీష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడుతుంటే.. రామ్‌.. భీమ్ ని పట్టుకోవడానికి రంగంలోకి దిగి ఏమి చేశాడు ? అనేది కథలోని మెయిన్ అంశమని తెలుస్తుంది.ఇక ఇదంతా జరగకముందే రామ్ - బీమ్ ఇద్దరూ స్నేహితులట.. ఆ స్నేహం పోయి చివరకు వైరం మిగులుతుందని సమాచారం.

అయితే, ఆ వైరం ప్లేస్ లో మళ్లీ స్నేహం ఎలా వచ్చి చేరింది అనేది మెయిన్ ఎమోషన్ అని తెలుస్తుంది.. అయితే, ట్రైలర్ ను ఓపెన్ చేసిన విధానం కూడా చాలా బాగుందట.

స్కాట్ దొర వారు.. మా అదిలాబాద్ ఓచ్చినప్పుడు ఓ చిన్న పిల్లను తీసుకొచ్చిండ్రు మీరు తీసుకొచ్చినాది ఓ కోన పిల్లనండీ.
అయితే.. వాళ్లకేమైనా రెండు కొమ్ములుంటాయా?
ఒక కాపరి ఉంటాడు అండి 


అని డైలాగ్ పూర్తి అవ్వగానే పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో భీమ్ ఇంట్రడక్షన్‌ వస్తోందని తెలుస్తుంది.. పులితో వేటాడుతున్న కొమరం భీమ్ ని పులి కంటే రౌద్రంగా చూపించి మొత్తానికి ఎన్టీఆర్ పై ఉన్న ప్రేమను రాజమౌళి ఈ రకంగా తీర్చుకున్నాడట.

ఇక ఆ పులిని పట్టుకోవడానికి వేటగాడు కావాలి. ఆ పని చేయగలిగేది ఒక్కడే సార్‌ అంటూ 

అనే డైలాగ్ పూర్తి అవ్వగానే చరణ్ యాక్షన్ ఎంట్రీ ఇచ్చాడట.ఆ తరవాత రామ్- భీమ్ ల మధ్య ఎమోషన్స్ ను హైలైట్ చేశాడట రాజమౌళి. మొత్తమ్మీద ఆర్ఆర్ఆర్ సినిమా పక్కా ఎమోషనల్ యాక్షన్ డ్రామా అని ఈ ట్రైలర్ చూస్తే అర్ధం అయిపోతుందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: