విజయ్ దేవరకొండ తో టాక్సీ వాలా సినిమా తో జతకట్టింది హీరోయిన్ ప్రియాంక జవాల్కర్. ఆ తర్వాత అడపదడపా సినిమా తీసినప్పటికీ ఆమెకు అంతగా కలిసి రాలేదు. కానీ ఆ మధ్య తన ఆరోగ్య సమస్యల కారణంగా కొన్ని సినిమాలలో ఆమెను రిజెక్ట్ చేసినట్లు తెలియజేసింది. కానీ ఈ సంవత్సరం బాగా సినిమాలతో ఆకట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. ఈమె తన అందంతో పాటు గా నటనతో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. టాక్సీ వాలా చిత్రంతోనే ఈమెకు మంచి క్రేజ్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ సంవత్సరం తిమ్మరుసు అనే సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా నటించింది.

ఇక ఈ మూవీలో ఒక న్యాయవాది పాత్ర లో నటించి మెప్పించింది. ఇక ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత S.R. కళ్యాణ మండపం అనే సినిమాతో మరొక కమర్షియల్ హిట్ అందుకుంది ప్రియాంక జవాల్కర్. ప్రస్తుతం ఇప్పుడు మరొకసారి కొత్త మూవీ తో మన ముందుకు రాబోతోంది ఈమె. ఇక ఈ రోజున విడుదల కాబోతున్న గమనం సినిమాలో నటించింది. ఈ సినిమాకి డైరెక్టర్ గా సృజన రావు తెరకెక్కించారు. ఈ సినిమాలో ఈమె ఒక ముస్లిం అమ్మాయిగా కనిపిస్తోంది.

ఇక ఈ సినిమా ట్రైలర్ బాగానే ఉందన్నట్లుగా సమాచారం. కథ పరంగా ఈ సినిమాకి మంచి ఊపు నిస్తుందని డైరెక్టర్ తెలియజేశాడు. ఇక ఇందులో ముఖ్యమైన పాత్రలో రాజు కందుకూరు కుమారుడు శివ కందుకూరి హీరోగా నటించడం గమనార్హం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ శ్రియ కూడా నటిస్తోంది. ఈమె కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంది. ఇక ఈ సంవత్సరం ఈ సినిమా కూడా హిట్ అయితే.. వీరందరి తలరాత లతో పాటు ప్రియాంక జవాల్కర్ హ్యాట్రిక్ హీట్ సాధించినట్లే. ఇక దీనితో పాటుగా మరికొన్ని ఆఫర్లు కూడా వచ్చే అవకాశం ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: