ప్రతి వారం అభిమాన హీరోల సినిమాలు వ‌స్తూ పోతూ ఉంటాయి.  ఎంతోమంది అభిమానులు వాళ్ళ హీరో సినిమా కోసం  ఎదురూ చూస్తూ ఉంటారు. ఎదురు చూసి సినిమా ఇలా ఉంది, అలా ఉంద‌ని వెళ్తూ ఉంటారు. అయితే ద‌ర్శ‌క ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న చిత్ర‌మైన ఆర్ఆర్ఆర్ లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ చిత్రం జ‌న‌వ‌రి 07న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు మూవీ మేక‌ర్స్‌.

ఇదంతా బాగానే ఉన్నా కానీ.. ఓ ప్ర‌శ్న మాత్రం  జూనియ‌ర్ ఎన్టీఆర్ ను తెగ ఇబ్బంది పెట్టింద‌ని టాక్‌. ఆయ‌న కూడా సీరియ‌స్‌గా మారిపోయారు మ‌రీ. ఒక స్టేజ్ మీద ఉన్నార‌నే కార‌ణంతో ఆయ‌న మాత్రం ఏమి మాట్లాడ‌లేద‌ని టాక్ వినిపిస్తోంది. అప్ప‌టివ‌ర‌కు న‌వ్వూతూ క‌నిపించిన ఎన్టీఆర్ ముఖం మాత్రం కొద్ది క్ష‌ణంలో అదోలో పెట్టేసారు. ఎన్టీఆర్‌ను అస‌లు అంత‌గా ఇబ్బంది పెట్టిన ప్ర‌శ్న ఏమిటి అనే సందేహం రాక మాన‌దు మ‌రీ. అస‌లు ఏమి జ‌రిగిందో ఇప్పుడు చూద్దాం.
 
ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌ల గురించి మీడియా ప్ర‌తినిధులు శ‌నివారం రోజు టికెట్ ధ‌ర‌ల గురించి.. ముఖ్యంగా ఏపీలో టికెట్ రేట్ల‌ను త‌గ్గించడం గురించి ప్ర‌శ్న‌లు వేసారు. ట్రిపుల్ ఆర్ నిర్మాత అయిన డీవీవీ దాన‌య్య‌ను.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జూనియ‌ర్ ఎన్టీఆర్  స్నేహితులు ఇద్ద‌రూ మంచి పొజిష‌న్‌లో ఉన్నార‌ని.. టికెట్ ధ‌ర‌లు త‌గ్గించిన విష‌యంలో ఏమి చేద్దామ‌నుకుంటున్నార‌ని ప్ర‌శ్నించారు మీడియా ప్ర‌తినిధులు. అన‌గా మీడియా ప‌ర్స‌న్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్టీఆర్ స్నేహితులు, అందులో అధికార పార్టీకి చెందిన మంత్రులు కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీల‌ను ఉద్దేశించి అని అంద‌రికీ అర్థ‌మైన‌ది. కానీ అక్క‌డ ఎవ‌రి పేర్లు ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

మీడియా ప్ర‌తినిధి అడిగిన ప్ర‌శ్న‌కు నిర్మాత దాన‌య్య స్పందిస్తూ టికెట్ ధ‌ర‌ల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వంలో చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయ‌ని.. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రెండు రాష్ట్రాలలో ప్రస్తుతం దాదాపుగా 1600 థియేటర్లు ఉన్నాయని.. ఏపీలో 1000 థియేటర్లు, తెలంగాణలో 600 థియేటర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

 అయితే ఆంధ‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ ధ‌ర‌ల‌ విషయంలోనే సమస్య ఎదుర్కొంటున్న‌ది చిత్రపరిశ్రమ అని.. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ. 100,  మున్సిపాలిటీ పరిధిలో రూ.60, పంచాయతీ పరిధిలో రూ.20 మించకుండా టికెట్ రేట్లు ప్రభుత్వం నిర్ణయించిందని దీనిపై మ‌రొక మారు ప్ర‌భుత్వానితో సంప్ర‌దింపులు జ‌రిపుతామ‌ని స‌మాధానం ఇచ్చారు నిర్మాత దాన‌య్య‌. మ‌రొవైపు జూనియ‌ర్ ఎన్టీఆర్ మాత్రం ఏపీ ప్ర‌భుత్వంలో త‌మ ఫ్రెండ్స్ ఇద్ద‌రూ ఉన్నార‌నే ప్ర‌శ్న‌పై సీరియ‌స్ అయ్యార‌ని టాక్ వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: