యాంకర్ అనసూయ బుల్లితెర ను ఏమాత్రం దూరం చేసుకోకుండా.. అడపాదడపా అవకాశాలు వచ్చినప్పుడు సినిమాలలో చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న అనసూయ.. ఈ మధ్య కాలంలో సినిమాల్లో తన దూకుడును బాగా పెంచింది అని చెప్పవచ్చు.. రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమా ద్వారా ఈమెకు రంగమ్మత్త గా మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఇప్పుడు సుకుమార్ ఈమె కోసం ఒక ప్రత్యేకమైన పాత్రను ఏర్పాటు చేసి మరీ పుష్ప సినిమాలో అవకాశం ఇవ్వడం నిజంగా ఆమె అదృష్టం అని చెప్పవచ్చు. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాలో దాక్షాయని పాత్రలో మనకు చాలా డిఫరెంట్ గా యాంకర్ అనసూయను చూపించబోతున్నారు సుకుమార్.

ఈ సినిమాలో సుకుమార్ నెగిటివ్ పాత్రలో అనసూయను చూపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమా నుంచి ఈమె కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా కూడా మారాయి.. ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.. కాబట్టి నిన్న రాత్రి ఘనంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్  జరిపారు. ఈ ఈవెంట్ లో అనసూయ మాట్లాడుతూmm నిజంగా ఇదంతా నాకు ఒక కలలా అనిపిస్తోంది.. రెండు సంవత్సరాలుగా ఎంతో మంది అభిమానులను చాలా మిస్ అవుతున్నాను.. బన్నీ కి నేను చాలా పెద్ద థాంక్స్ చెప్పాలి..

ఎందుకంటే సాధారణంగా చాలామంది తమ కోరికలను అమ్మానాన్న లనో లేదా దేవుడినో మాత్రమే అడుగుతూ ఉంటారు. కానీ నేను ఒకరోజు స్టేజి మీదకు వచ్చినప్పుడు బన్నీతో నేను మీతో చేయాలని ఉంది.. అని అడిగాను. ఇక ఆలస్యం చేయకుండా మరో వారం రోజుల్లోనే నాకు ఫోన్ కాల్ వచ్చింది.. ఆ తర్వాత ఇదే కంటిన్యూ అవుతుంది అంటే.. నేను బన్నీని చాలా అడగాలి.. సినిమాలలో అవకాశాలు.. అంటూ ఆమె డబుల్ మీనింగ్ వచ్చేలాగా గ్యాప్ ఇచ్చి , గ్యాప్ ఇచ్చి మాట్లాడడంతో అభిమానుల్లో మళ్లీ ఈలలు ,గోలలు మొదలయ్యాయి. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు బన్నీ కి, సుక్కు సార్ కి నా థ్యాంక్స్ అంటూ ఆమె తెలిపింది. ఇప్పటికే రంగస్థలం సినిమాలో సుకుమార్ అనసూయ కు మంచి క్రేజ్ ను తీసుకువచ్చి పెట్టారు. ఇక పుష్ప విడుదల అయితే ఆమెకు ఎలాంటి గుర్తింపు వస్తుందో వేచి చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: