అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లు గా తెరకెక్కిన సినిమా పుష్ప.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా ఇది. భారీ అంచనాల తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఈరోజు వచ్చింది. సినిమాను అనుకున్న దానికన్నా బాగుందని టాక్ వినిపిస్తోంది. సుకుమార్ ఏది అయితే అనుకున్నాడో అది కరెక్ట్ గా చూపించి బేష్ అనిపించుకున్నాడు. ఇది అది అని కాదు సినిమా మొత్తం జనాలకు తెగ నచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..


హీరో పాత్రకు అల్లు అర్జున్ న్యాయం చేసినట్లు అభిమానులు, సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక హీరోయిన్ రష్మిక కూడా పాత్రలో జీవించి నటించింది. ముఖ్యంగా సాంగ్స్ లలో అయితే ఈ అమ్మడు హైలెట్ అయ్యింది. సామీ సామీ పాటకు అమ్మడు డ్యాన్స్ ఫీక్స్.. సినిమా నుంచి బయటకు వచ్చిన పాటలు ముందే ట్రెండ్ అయ్యాయి. ప్రతి సన్నీవేశాలు కూడా కళ్ళకు కట్టినట్లు డైరెక్టర్ చూపించాడు.. సుక్కు ఖాతాలో మరో హ్యాట్రీక్ అనే వార్తలు ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.


కథకు తగ్గట్లు దేవి మ్యూజిక్ ను అందించాడు. తగ్గేదెలే.. సినిమాకు హిట్ టాక్ రావడానికి దేవి మెయిన్. బ్యాగ్రౌండ్ మ్యుజిక్ వింటే గూస్ బంప్స్ రావాల్సిందె..అంతా బాగానే వుంది కానీ ఐటమ్ సాంగ్ గురించి చెప్పాలంటే మాటలు రావు. సమంత లాంటి స్టార్ హీరోయిన్ ఈ పాటకు స్టెప్పులు వేసింది. దాంతో సినిమా లెవల్ హైప్ అయ్యింది. సాంగ్ రిలీజ్ అయిన మొదట్లో ఎన్నో విమర్శలు అందుకుంది. మగవాళ్ల మనోభావాలను దెబ్బ తీసేలా ఉండడంతో కొంత చర్చలు జరిగాయి. అయినా కూడా ఎదో చెప్పి పాటను ఉంచారు. మిగిలిన పాటలు ఒక లెక్క ఈ పాట మరో లెక్క. ఇది ఇలా ఉండగా ఈ సినిమా ను చూసిన అక్కినేని అభిమానులు సమంత పై మండిపడ్డారు. ఇలా చేయడం కోసమే చైతన్య ను వదిలేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనికి సామ్ ఎలా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తిగా మారింది..



మరింత సమాచారం తెలుసుకోండి: